ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

, నల్గొండ , 21.2.2025 హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్, చిన్న చిన్న బడ్డీ కోట్లు తదితర ప్రదేశాలలో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పనిచేయాలని అన్నారు .ఎక్కడైనా రెస్టారెంట్లు, హోటల్లు బడ్డీ కోట్లు, తోపుడు బండ్లు వారు వాడిన నూనెలను తిరిగి వాడడం ,అలాగే కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడటం వంటివి చేయకుండా తరచూ దాడులు నిర్వహించాలని, ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే సీజ్ చేయడమే కాకుండా, కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ ఇప్పటివరకు అభద్రత ఆహార పదార్థాలను వినియోగించినందుకుగాను నల్గొండ జిల్లాలో 16 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా కలె...