Posts

భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్ నామినేషన్ దాఖలు

Image
 *భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్ నామినేషన్ దాఖలు*              మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ *డివిజన్ నెం. 25 భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్* శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రెయిన్ బో శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తనకు  వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కార్యాలయ కార్యదర్శిగా,  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  మాజీ టెలికాం బోర్డ్ మెంబర్ గా పనిచేసిన అనుభవంతో పాటు, భగీరథ కాలనీలోని ఉద్యోగస్తులు, యువత, రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలతో పాటు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో డివిజన్ నెంబర్ 25 నుండి తాను గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా రెయిన్ బో శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో లక్ష్మణ్ రావ్, ఇంతియాజ్, కొంతం లక్ష్మణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం* - *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి*

Image
  *నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం* - *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి* *మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు* ************************************************** *నల్లగొండ*:  **ఫిబ్రవరి 11న జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు* *శుక్రవారం తన సతీమణి నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిచే 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు* *ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు* *నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో కేంద్ర,రాష్ట్రాల నుంచి అత్యధిక నిధులు వస్తాయన్నారు* *దీంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు* *ఇప్పటికే పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు* *కార్పొరేషన్ లోని అన్ని డివిజన...

నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

Image
నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ నల్గొండ:  బీజేపీ రాజ్యసభ సభ్యుడు *డాక్టర్ కే లక్ష్మణ్* నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పాయింట్స్... రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు... గతంలో టీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు... కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదని, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు... పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని అన్నారు... నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పేదల సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు...

వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై సమావేశం

Image
  వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై సమావేశం హైద్రాబాద్: "వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై జనవరి 29, 2026న MCHRDITలో ఒక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. "ఆరోగ్యకరమైన తెలంగాణ కోసం పరిశుభ్రమైన గాలి" అనేది ప్రభుత్వ నినాదమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. స్థిరమైన అభివృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం లక్ష్యం. మెరుగైన రేపటి కోసం పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం నీటి వనరుల పునరుద్ధరణ మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ చర్యలు తీసుకుంది. గాలి నాణ్యత పౌరుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది మరియు తద్వారా ఉత్పాదకత రాష్ట్ర GDP పై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024 వంటి అనేక నివేదికలు సూచిస్తున్నాయి అధిక రక్తపోటు తర్వాత మరణానికి వాయు కాలుష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన ప్రమాద కారకంగా ఉంది. 2021-2023 నాటికి ఏటా దాదాపు 8.1 మిలియన్ల అకాల మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో...

నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ

Image
 నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ. నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ 45 వ డివిజన్ నుండి BRS పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గడాలె విజయ ను ప్రకటించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా గడాలె విజయ మాట్లాడుతూ  45 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేయుచున్నానని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాననీ, ఈ ప్రయాణంలో డివిజన్ అందరి సహాయ సహకారం, మద్దతు నాకు ఎల్లప్పుడూ అవసరం అని, మీ నమ్మకానికి తగ్గట్టుగా, నిరంతరం మన డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నాననీ తెలిపారు. ఈ అవకాశాన్ని అందించిన మా ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని  న్యాయవాది  పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు గూఢచారి, హైదరాబాద్, 29 జనవరి:  తెలంగాణ ఆర్యవైశ్య  మహాసభ ఎన్నికల పై ఆగీర్ వెంకటేశం వేసిన కేసుకు కోర్టు పిటిషనర్ యొక్క ప్రస్తుత పిటిషన్ ను ఈ రోజు కోర్టు అనుమతిస్తు,   24-02-2025న మెమో నెం.6395/Regn.II/2025 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారి స్థానంలో న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను  నియమిస్త ఉత్తర్వులు జారీ చేసినది. ఈ  తేదీ నుండి రెండు నెలల వ్యవధిలో ప్రతివాది నెం.1 సొసైటీ  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యొక్క బై-లాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓట్లను లెక్కించి, తదనుగుణంగా తగిన భద్రతతో ఫలితాలను ప్రకటించి, కోర్టు ముందు సమ్మతి నివేదికను దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషనర్ ఫీజు రూ.10,000/- గా నిర్ణయించబడిందనీ మరియు పిటిషనర్ అడ్వకేట్ కమిషనర్ ఫీజును అడ్వకేట్ కమిషనర్‌కు చెల్లించి, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుండి (7) రోజులలోపు కోర్టు ముందు మెమోతో పాటు రసీదును దాఖలు చేయాలని ఆ ఆర్డర్ లో తెలిపింది.

ఫ్లాష్.. ఫ్లాష్.. BRS రెండవ జాబితా విడుదల

Image
 నల్గొండ  మున్సిపల్ కార్పొరేషన్ BRS అభ్యర్థుల రెండవ జాబితా విడుదల