ఆరు రాష్ట్రాలకు కొత్త.....
*ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం*
ఆరు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే గవర్నర్లుగా పనిచేస్తున్న ఇద్దరు గవర్నర్లను బదిలీ చేయగా, మరో నలుగురిని కొత్త గవర్నర్లుగా నియమిస్తూ.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందిబెన్ పటేల్ నియామకం...
ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందిబెన్ ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ దంకర్ నియామకం.
త్రిపుర గవర్నర్‌గా రమేష్ బయాస్ నియామకం.
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా లాల్‌జీ తాండన్..
ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా లాల్‌జీ ఉన్నారు.
బీహార్ గవర్నర్‌గా ఫాగు చౌహాన్ నియామకం.
నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి నియామకం.
ఈ నియామకాలు వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.
Comments
Post a Comment