Posts

Showing posts from July, 2019

ఫరూక్ నగర్  సబ్ రిజిష్టర్ పై కేసు నమోదు!!

*ఫరూక్ నగర్  సబ్ రిజిష్టర్ పై కేసు నమోదు!!* *ఫోర్జరీ సంతకలతో  స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తితో పాటు సబ్ రిజిష్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితుడు!!* *కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు!!* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  ఫరూక్ నగర్ ,సబ్ రిజిష్టర్ సతీష్ పై కేసు నమోదైంది,ఇంటి స్థలాల దస్త్రాలను ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో బుధవారం షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.  పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. రాఘవరావు అనే వ్యక్తి బుచ్చయ్య దగ్గర 2011లో  షాద్ నగర్ పట్టణంలోని సర్వేనెంబర్ 717/ఆ లో గల 147, 148లలో మొత్తం 236 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామానికి చెందిన  శ్రీనివాసులు అనే వ్యక్తి రాఘవరావు సంతకాలను ఫోర్జరీ చేసి 236 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇతరులకు అమ్మివేశారని తెలిపారు. సదరు యజమాని విషయం తెలుసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బాధితుడు రాఘవారావు అడగగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడని ఇప్పుడు అసలు తతంగం బయటపడిందని నన్ను మోసం చేసిన వ్యక్తితో పాటు షాద్ నగర్ సబ్ రిజిష్టర్...

ఆవు పేడ తో రాఖీలు

Image
ఆవు పేడ తో రాఖీలు పర్యావరణ పరిరక్షణకు యూపీలోని ఓ గోశాల నిర్వాహకులు వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు. ఆవుపేడతో రాఖీలను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. సహజ రంగులు, దారాలతో వీటిని తయారు చేసినట్టు గోశాల నిర్వాహకురాలు అల్కాల హోటి తెలిపారు. శ్రీకృష్ణ గోశాల నిర్వహిస్తున్న తన తండ్రికి తోడుగా ఉండేందుకు ఇండోనేషియాలో ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన అల్కాల హోటి ఈ సరికొత్త ఆలోచన చేశారు.   ఆవుపేడతో చేసిన ఈ రాఖీలను తొలిసారి కుంభమేళాలో ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన వారి నుంచి మంచి స్పందన వచ్చింది. పర్యావరణ రహితం కావడంతో పాటు ఆవుపేడతో చేసింది కావడంతో ఒడిశా,కర్నాటక,ఉత్తరాఖండ్ నుంచి ఆర్డర్లు వచ్చాయి. దీంతో వేలాదిగా రాఖీలు తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ రాఖీలను వివిధ ఆకృతుల్లో తయారు చేసిన టెంప్లెట్లలో నింపి ఆరబెడతారు. అవి గట్టిపడగానే రంగులు, ధారాలు చుట్టి అందంగా తయారు చేస్తారు. అయితే వీటిని తయారు చేయడంలో ముందుగా చాలా సవాళ్లు ఎదురైనట్టు అల్కాల హోటి వెల్లడించారు.పేడతో తయారు చేసింది కావడంతో అవి వెంటనే విరిగిపోయేవని చెప్పారు. అయితే తరువాత విరిగిపోకుండా ఉండేందుకు ప్రయోగాలు చేసి సక్సెస్ అయినట...

గుత్తా బాలకృష్ణ కు బెస్ట్ మోటివేటర్ అవార్డు

Image
పాఠం పాడు గ్రామానికి చెందిన గుత్తా బాలకృష్ణ అనే వ్యక్తికి బెస్ట్ మోటివేటర్ అవార్డు దక్కింది ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే నిరుద్యోగులకు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించే మోటివేషనల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ తరగతులు ఉచితంగా నిర్వహించే వారిలో ప్రేరణ అందుకుగాను వారికి హైదరాబాదులోని లైన్స్ క్లబ్ లో ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు బాలకృష్ణ వెయ్యి మందికి పైగా విద్యార్థులకు 300 మందికి పైగా  నిరుద్యోగ యువతి యువకులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించి వారిలో నైపుణ్యాలను పెంపొందించారు  ఈ నేపథ్యంలో ఆయన మోటివేటర్ గా వార్డుకు ఎంపికకాగా అవార్డుల  ప్రధాన ఉత్సవం లో  వరంగల్ మేయర్ గూండా ప్రకాష్ గారి చేతుల మీదుగా ప్రముఖ లైఫ్ కోచ్ గంపా నాగేశ్వర్ రావు గారి సమక్షంలో అవార్డును అందుకున్నారు  తమ గ్రామ వాసి కి రావటం పై కమ్మవారి పాలెం లోనే ఆయన స్నేహితులు బంధువులు వ్యక్తం చేస్తున్నారు ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని ఇకనుండి మరింతగా స్కూల్స్ కాలేజెస్ మరియు నిరుద్యోగులకు తన సేవలను అందించాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలియజేయడం జరిగింది

ఎన్కౌంటర్, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ లింగన్న మృతి

Image
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా https://youtu.be/7ldkoJ_oQmQ గుండాల మండలం దేవలగూడెం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ లింగన్న మృతి, మృతుడు లింగన్న మృతదేహాన్ని తరలిస్తుండగా అడ్డుకున్న ప్రజలు, పోలీసులకు స్థానిక ప్రజలకు మధ్య ఘర్షణ, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు, పరిస్థితి ఉద్రిక్తం, ఇద్దరు పోలీసులకు గాయాలు, గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.. అటవీ ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు.

రామ్ రెడ్డి మృతికి సిపిఐ సంతాపం

రామ్ రెడ్డి మృతికి సిపిఐ సంతాపం రైతాంగ సాయుధ పోరాట యోధులు సీనియర్ కమ్యూనిస్టు పార్టీ  నాయకుడు కామ్రేడ్ గ ట్టి కొప్పుల రామ్ రెడ్డి మృతికి సిపి ఐ నల్లగొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియ జేసింది. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం  సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి రామ్ రెడ్డి అని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం ముందుండే వారని అన్నారు. వారి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం సానుభూతిని తెలియజేశారు.   పల్లా నరసింహారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లగొండ.

ఖాళీ కడుపులతో డైట్ విద్యార్దులు

Image
నల్లగొండ పట్టణంలోని డైట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేక ఖాళీ ప్లేట్లు పట్టుకున్న విద్యార్థులు...ఖాళీ కడుపులతో వెనుదిరిగిన విద్యార్థులను పరిశీలిస్తున్న కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున పట్టణ కార్యదర్శి గాదె నర్సింహ బిటిఎస్ నల్లగొండ

మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శాంతినగర్ లో దారుణం.

Image
https://youtu.be/Wm5k5V06joc  రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్  పల్లి  లో దారుణం చోటుచేసుకుంది.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం...  హైదరాబాద్: కళ్లు నెత్తికెక్కిన ఓ కామాంధుడు అభం శుభం తెలియని మూడు  సంవత్సరాల చిన్నారి పైన అత్యాచారం చేసిన సంఘటన  మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సత్తయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రుబీనా అనే మహిళ గత కొంతకాలంగా కాటేదన్ ప్రాంతంలోని శాంతినగర్ లో నివాసం ఉంటుందని వీరి స్వస్థలం బీహార్ కాగా పొట్ట కూటి కోసం కాటేదాన్ నివాసం ఉంటున్నారని మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు రుబినా చిన్న కుమార్తె మూడు సంవత్సరాల వయసు గల పాపను తన మేనల్లుడు రాజు, ఉద్దేశపూర్వకంగానే అంగన్వాడి సెంటర్ నుంచి మధ్యాహ్నం తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, రాత్రి సమయంలో ఇంటి దగ్గర విడిచి పెట్టి వెళ్లిపోయారని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసిందని ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు.

పాత బస్తీలో పేలుళ్ళు

Image
పాతబస్తీలో పేలుళ్లు కలకలం రేపాయి. సైదాబాద్‌లోని వీఐపీ పాఠశాల పక్కనున్న ఓ భవన నిర్మాణం పనుల్లో భాగంగా.. జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి పేలుళ్లు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధాలు రావడంతో.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.అయితే అకస్మాత్తుగా ఈ పేలుళ్లు సంభవించడంతో.. స్థానికులు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్ధులు భయాందోళనలకు గురయ్యారు. పేలుళ్ల కోసం భారీ జిలెటిన్‌స్టిక్స్‌ను ఉపయోగించడంతో భారీ శబ్ధం వచ్చింది. సమీపంలోని పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఘటనపై స్కూల్ యాజమాన్యంతో పాటు.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.అక్కడి నుంచి జిలెటిన్ స్టిక్స్, పేలుళ్ల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణం చేపడుతున్న యజమానితో పాటు కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో చిరుత కలకలం.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో చిరుత కలకలం. హైదరాబాద్‌:- భాగ్యనగరంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కూకట్‌పల్లి పరిధిలో చిరుత ప్రత్యక్షమైంది. ప్రగతినగర్‌-గాజులరామారం మధ్య చిరుత సంచరిస్తున్నట్లుగా సమాచారం. చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రగతినగర్‌ వాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు...

కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి

Image
బెంగళూరు:  కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  స్పీకర్‌ పదవికి మరెవరూ నామినేషన్‌ బెంగళూరు:  కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  స్పీకర్‌ పదవికి మరెవరూ నామినేషన్‌ వేయకపోవడంతో కర్ణాటక విధానసభకు నూతన సభపతిగా విశ్వేశ్వర ఎన్నికైనట్లు స్పీకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.  విశ్వేశ్వర వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు పార్టీకి నమ్మకమైన నేతగా ఎదిగారు.  రాజ్యాంగం, శాసనసభా వ్యవహారాలపై పరిజ్ఞానం, భాషపై పట్టు, అందరితో కలిసే తత్వం ఆయన సొంతం. గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆయనవైపు మొగ్గు చూపారు.  పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన సేవలందిస్తానని ఈ సందర్భంగా విశ్వేశ్వర అభిప్రాయపడ్డారు.  సిర్సి నియోజవకర్గానికి చెందిన కగెరి మంగళవారం యెడియూరప్ప, పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే.  తొలి మంత్రివర్గంలో దాదాపు 10 ...

తెలంగాణ wam అధ్యక్షుడు గా చకిలం రమణయ్య

Image
ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ  తెలంగాణ రాష్ట్రానికి నూతన కార్యవర్గాన్ని నియమించిన  అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ. అధ్యక్షునిగా చకిలం రామనయ్యను,  ప్రధాన కార్యదర్శిగా కె. విఠల్ ను, కోశాధికారిగా మరాంశెట్టి శ్రీనివాస్ లను నియమించినట్లు తెలిపారు.  వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నియామక పత్రాలు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీం  ప్రపంచ మహాసభ కార్యక్రమాలు చేయుటలో అవుతున్నదని  ఆశాభావం వ్యక్తపరిచారు.

గోలి శిరీషను అభినందించిన మాజీ MLA తాతయ్య

Image
గోలి శిరీషను అభినందించిన మాజీ ఎమ్మల్యే తాతయ్య స్పోర్ట్స్ అకాడమీ కు సెలెక్ట్ అయిన గోలీ శిరీష ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య . వత్సవాయి మండలం మంగొల్లు గ్రామానికి చెందిన గోలీ శిరీష 2014 - 15 వ సంవత్సరంలో 6 వ తరగతి చదువుతూ ప్రారంభించిన కబడ్డీ ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతోంది ఇప్పటివరకు డిస్ట్రిక్ట్, స్టేట్స్ మరియు నేషనల్  వరకు (విజయవాడ,గుంటూరు,ప్రకాశం, చిత్తూర్,మధ్యప్రదేశ్) లలో ఆడటం జరిగింది ఈ మధ్య మైలవరం గ్రామంలో జరిగిన లక్కిరెడ్డి-హనిమిరెడ్డి అకాడమీకి జరిగిన కబడ్డీ  సెలక్షన్స్ లో శిరీష సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ నేను మ్యాచ్ లకు వెళ్లే ప్రతిసారీ  శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారే ఆర్థికసాయం చేసేవారు అదేవిధంగా మంగొల్లు గ్రామ మాజీ సర్పంచ్ మన్నే రాజేశ్వరి, నారాయణ రావు గారు కూడా ఆర్థికంగా సాయం చేసేవారని తెలియజేసింది ఈ సందర్భంగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ఆడుతున్న శిరీష జాతీయస్థాయి లో ప్రతిభ కనబరచాలని అభినందించి ఆర్థికంగా సాయం చేశారు

క్యూనెట్ బాధితుడు  సాఫ్ట్  వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

క్యూనెట్ బాధితుడు  సాఫ్ట్  వేర్ ఇంజనీర్ ఆత్మహత్య మదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యూనెట్ బాధితులు అరవింద్(31) ఆత్మహత్య శ్రీకాకుళంకు చెందిన అరవింద్ అసెంచర్ లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగ పని చేస్తున్నాడు....  అరవింద్ క్యూనెట్ స్కాంలో సుమారు 20 లక్షల రూపాయలవరకు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు గతంలోనే క్యూనేట్ మోసాలపై సైబరాబాద్  కమిషనరేట్లో పలు సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.... వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న క్యూ నెట్ సంస్థ...

రవి ప్రకాష్ రెండో దెబ్బ ... మై హోమ్  మీడియా అబ్బా ....

రవి ప్రకాష్ రెండో దెబ్బ ... మై హోమ్  మీడియా అబ్బా .... తన మీద దొంగ కేసులు బనాయించి TV9 ను ఆక్రమించి నందుకు రవి ప్రకాష్ ప్రతీకార చర్య మొదలుపెట్టాడు. వయొలెంట్  గా గెంతులు వేసిన వారికి సైలెంట్ గా దెబ్బ రుచి చూపిస్తున్నాడు. రవి ప్రకాష్ తోలి అడుగు రివెంజ్ 1 లో MyHome మీద IT దాడుల రూపం లో రామేశ్వర రావు కి సినిమా చూపించాడు. ఈ రోజు రిలీజ్ అయినా రివెంజ్ 2 సినిమా లో సెర్బియా దేశం లో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు.  నిమ్మగడ్డ ప్రసాద్ MyHome మీడియా వెంచర్ లో సైలెంట్ పార్టనర్. 10TV , TV9 మరియు Mojo TV ల లో తనకి వాటా ఉంది. మా టీవీ అమ్మకం లో నాన్ కంపిట్ అగ్రిమెంట్ కారణం గా నేరు గా తన పేరు పెట్టకుండా సింగా రావు అనే అనుచరుడిని ముందు పెట్టి ప్రసాద్ షో నడిపిస్తున్నాడు. తనను బయటకు పంపి TV9 కబ్జా చెయ్యటానికి ప్రధాన కారణం నిమ్మగడ్డ ప్రసాద్ అని గ్రహించిన రవి ప్రకాష్ అదును చూసి దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. రవి ప్రకాష్ తరువాత వేయబోయే అడుగులు ఏంటన్న విషయం ఫై చర్చ్ జరుగుతోంది. రివెంజ్ 3 లో భాగం గా MyHome ఫై ఈ డి దాడులు జరుగుతాయని, రివెంజ్ 4 లో భాగం గా మేఘ కృష్ణ రెడ్డి వెయ్యి కోట్ల GST పన్ను ఎగ...

కేఫ్‌కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. 

Image
మంగుళూరు:  కేఫ్‌కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు.  రెండు రోజుల క్రితం అదృశ్యమయిన ఆయన.. నేత్రావతి నదిలో దూకినట్లు స్థానిక జాలరి ఒకరు వెల్లడించారు.  అయితే ఈరోజు ఉదయం సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది. సోమవారం సాయంత్రం బెంగళూరు నగర శివార్లలోని తొక్కుట్టు ప్రాంతంలో నేత్రావతి నది వంతెన వద్ద ఆయన అదృశ్యమయ్యారు.  తాను వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని ఓ లేఖ రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయారు.

వీటి కాలనీ బస్ స్టాప్ లో రిజర్వేషన్ పునరిద్దరించాలి

Image
నల్గొండ వీటి కాలనీలోని బస్ స్టోప్ లో హెద్రబాద్ నాన్ స్టాప్ బసుకు రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఆర్టీసీ సూపరింటెండెంట్  శ్యామలకు  మాజీ కౌన్సిలర్ రావుల  వినతి పత్రం ఇచ్చారు. గతంలో 15  సంవస్థములనుండి ప్రజల సౌకర్యమ్ కొరకు వీటి కాలనీలో రెజర్వేషన్  ఏర్పాటు చేశారని, కొని రోజుల క్రితం రిజర్వేషన్ తొలగిన్చడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగుతున్నాయని రిజెర్వేషన్ వెంటనే పునరుద్ధరణ  చేయాలని కోరారు. ఈ వినతి పత్రం ఇచ్చినవారిలో  నాగార్జున రెడ్డి, సతీష్, వెంకటేశ్వర్లు, నరేష్ పరమేష్, వెంకట్ స్వామి, తదితరులు ఉన్నారు.

ఒకరికి ఇద్దరు... పాక్‌పై భారత బలగాల ప్రతీకారం

Image
*ఒకరికి ఇద్దరు... పాక్‌పై భారత బలగాల ప్రతీకారం*            వరుసగా మూడు రోజుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్న పాకిస్తాన్ సైన్యానికి భారత భద్రతా దళాలు ఇవాళ గట్టి సమాధానం చెప్పాయి. ఓ జవానును పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌కు ఇద్దరు పాక్ రేంజర్లను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, కుప్వారా జిల్లాల్లో పాక్ సైనిక మూకలు కాల్పులకు తెగబడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ రేంజర్లపై అంతే స్థాయిలో విరుచుకుపడిన భారత జవాన్లు ఇద్దరు పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు అధికారుల వెల్లడించారు.   సోమవారం కూడా పూంచ్‌లోని షాపూర్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో సరిహద్దు ప్రాంతాలపై పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఆదివారం పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో 10 రోజుల పసికందు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. కాగా గత ఆరు నెలల్లో పాకిస్తాన్ మొత్తం 1,248 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. కేవలం మ...

ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

*ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం* ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఈ సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు లభించాయి. ఇటీవలే లోక్ సభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఉభయసభల్లో ఈ బిల్లుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇకమీదట ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, ఆమోదానికి 121 ఓట్లు కావాలి. అయితే, పలు పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, మరికొన్ని పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దాంతో సభలో అందుబాటులో ఉన్న సభ్యులతోనే ఓటింగ్ నిర్వహించారు. ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే దేశంలో ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది. ట్రిపుల్ తలాక్ పద్ధతిని ఇస్లామిక్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే తలాక్ పై నిషేధం విధించాయని చెబుతూ ఎన్డీయే ఎప్పటినుంచో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు పోరాడుతోంది. ఇస్లామిక్ దేశాలు సైతం ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్న తరుణంలో లౌకిక దేశమైన భారత్ లో ఎందుకు రద్దు చేయలేమం...

తన బార్య గర్భవతి కాలేదని పక్కింటి వ్యక్తి పై కోర్ట్ లో కేసు  చేసిన భర్త*

*తన బార్య గర్భవతి కాలేదని పక్కింటి వ్యక్తి పై కోర్ట్ లో కేసు  చేసిన భర్త* తను కట్టుకున్న భార్యకి గర్భం రాలేదని పక్కింటి యువకుడిపై కేసుపెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. అదేంటి తన భార్య గర్భవతి కాకపోతే పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటి అని పరేషన్ అవుతున్నారా? అయితే మీరు అసలు ముచ్చట చదవాల్సిందే. అయితే జర్మనీలోని ఓ కోర్టులో జరిగిన వాదనల్లో డానీ అనే వ్యక్తి తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింట్లో ఉంటున్న వ్యక్తి ఘోరంగా విఫలమయ్యాడని సదరు వ్యక్తిని ఏకంగా కోర్టుకు ఈడ్చాడు డానీ అనే వ్యక్తి. అయితే ఇప్పటికే 2.500 డాలర్లు చెల్లించుకున్నట్లు కోర్టుకు వివరించాడు. ఇక అసలు మ్యాటర్ కి పోతే డానీ అనే వ్యక్తి ఎదో లోపంతో అతనికి పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. అయితే ఎలాగైన తన భార్యను ఓ తల్లిని చేయలని కంకణం కట్టుకున్నాడు డానీ. ఇందులో భాగంగా పక్క ఇంట్లో నివాసం ఉంటున్న జోస్ అనే వ్యక్తికి తన భార్యను ఎలాగైన  తల్లిని చేసే బాధ్యత అప్పగించినట్లు బాధిత వ్యక్తి కోర్టుకు తెలిపాడు. కాగా ఒప్పందంలో భాగంగానే ఆరు నెలల్లో తన భార్యను గర్భవతిని చేయాలని డానీ సదరు వ్యక్తిని ఆదేశించాడు. ఇగ డానీ షర...

సోనీ కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు

*కిడ్నాప్‌ మిస్టరీ; వివరాలు వెల్లడించిన సీపీ*                                                                                                                సంచలనం సృష్టించిన ఫార్మాసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాపర్‌ రవిశేఖర్‌ను పోలీసులు అద్దంకిలో అరెస్ట్‌ చేసి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్‌కు సంబంధించి సోని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కిడ్నాపర్‌ రవిశేఖర్‌ తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని సోని తెలిపిందన్నారు. 'గత ఏడు రోజులుగా కారులోనే ఉంచిన కిడ్నాపర్.. నిన్న చిలకలూరిపేటలో సోనీని వదిలేశాడు. బస్‌ కండక్టర్‌ సాయంతో అద్దంకి వచ్చి అక్కడి...

పోలీసులు వేదిస్తున్నరాని.. ఏంచేశాడో వీడియో చూడండి

Image
ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం సింగరాయకొండ గ్రామానికి చెందిన తన్నీరు. నాగరాజు సింగరాయకొండ పోలీసులు వేదిస్తున్నరాని.. ఏంచేశాడో వీడియో చూడండి https://youtu.be/or6s3Yjw0d8 పరిస్థితి విషమం

ప్రతివారం గ్రామ దర్శిని,నగర దర్శిని కార్యక్రమం: జిల్లా కలెక్టర్ డా. గౌర వ్ ఉప్పల్*

Image
  *ప్రతివారం గ్రామ ద ర్శిని,నగర దర్శిని కార్యక్రమం: జిల్లా కలెక్టర్ డా. గౌర వ్ ఉప్పల్* * శుక్రవారం నుండి ప్రారంభం * మండల ప్రత్యెక అధికారులు,అర్.డి. ఓ. ల ఆద్వర్యంలో గ్రామ,నగర సందర్శన * ఈ శుక్రవారం మండల స్థాయిలో వివిధ శాఖల  అధికారులతో సమన్వయ సమావేశం, మధ్యా హ్నం ప్రభుత్వ వసతి గృహాల ఆకస్మిక తనిఖీ నల్గొండ:  శుక్రవారం నుండి గ్రామ దర్శిని,నగర దర్శిని కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ తెలిపారు.మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా శాఖ అధికారుల తో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గ్రామ దర్శిని,నగర దర్శిని కార్య క్రమం,హరిత హరం, పెండింగ్ కోర్టు కేసులు ఇతర అంశాలు సమీక్షించారు.ప్రతి శుక్ర వారం గ్రామ,నగర దర్శిని కార్యక్రమం నిర్వహించ నన్నట్లు తెలిపారు.మండల ప్రత్యెక అధికారులు,అర్.డి. ఓ. ల ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి శుక్రవారం మండలంలో వివిధ ప్రభుత్వ శాఖ ల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మండలంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని అన్నారు.గ్రామ,నగర దర్శిని కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల లు,వసతి గృహాలు,అంగన్ వాడి కేంద...

మినరల్ పౌండేషన్ ట్రస్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి- జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్

Image
నల్గొండ : జిల్లాలో మినరల్ పౌండేషన్ ట్రస్ట్ ద్వారా పారిశుధ్య నిర్వహణ కు మంజూరైన నిధులతో మున్సిపాలిటీలలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో మున్సిపాలిటీ కమిషన ర్ లు,మున్సిపల్ స్పెషల్ అధికారుల తో నిర్వహించిన సమావేశం లో మున్సిపాలిటీ లలో డి.ఎఫ్.ఎం.టి.నిధులతో చెత్త సేకరణ,పారిశుధ్య నిర్వహణ. కు ట్రాక్టర్,ఆటో ల కొనుగోలు కు ఇతర పనులకు మంజూరు చేసిన పనుల ప్రగతి ని మున్సిపాలిటీ వారీగా సమీక్షించారు.ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీ హాలియా,చిట్యాల, నందికొండ, చండూర్ మున్సిపాలిటీ లలో పనుల టెండర్ లు వేగవంతం చేసి పారిశుధ్యం ఇతర పనులు చేపట్టాలని అన్నారు.అదే విధంగా అమృత్ పథకం కింద నల్గొండ,మిర్యాల గూడ,దేవర కొండ మున్సిపాలిటీ లలో చేపట్టిన త్రాగు నీరు సరఫరా పైప్ లైన్ పనుల సందర్బంగా దెబ్బ తిన్న సిసి రోడ్లు, పాత పైపు లైన్ లు సెప్టెంబర్ 15 లోగా పునరుద్దరించాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డా.ఎన్.సురేందర్, నల్గొండ మున్స...

రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయాలి - టీజేయస్

Image
రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయాలి - టీజేయస్ TJS రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు   తెలంగాణ జన సమితి పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  రుణమాఫీ, రైతుబందు చెల్లింపు చేయని రైతులకు వెంటనే చెల్లించుట,పంటలు వేయడం అలస్యమైనందున పంటల బీమా ఆగస్టు 31 వరకు పెంచుటకు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు.

చిట్యాలో బీజేపీ సభత్వ నమోదు-  పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి  బండారు

Image
చిట్యాలో బీజేపీ సభత్వ నమోదు-  పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి  బండారు https://youtu.be/7QecFVjt3x0 నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో బిజెపి సభత్వ నమోదు   కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా  మాజీ కేంద్ర మంత్రివర్యులు  బండారు దత్తాత్రేయ, బీజేపీ జిల్లా అధ్యక్షులు  నూకల నరసింహా రెడ్డి , సభ్యత్వ జిల్లా ప్రముఖ్ గార్లపాటి జితేంద్ర కుమార్ లు పాల్గొన్నారు.గఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధు సూధన్ రెడ్డి, వీరెల్లి శేఖర్, పల్లెబోయిన శ్యామసుందర్ , పోతేపాక సాంబయ్య  నకిరేకంటి మొగిలయ్య,  గోశిక వెంకటేశం , అశోక్, సైదులు, కాసర్ల లింగయ్య, మాస శ్రీనివాస్ లు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ లతో కొనసాగిస్తున్న అనుబంధమే కారణం - అల్లం

Image
  జర్నలిస్ట్ లతోకొనసాగిస్తున్న అనుబంధమే కారణం - అల్లం మూడవసారి మీడియా అకాడమీ చైర్మన్ గా  ఎన్నిక కావడానికి మన సంస్థ TUWJ నాయకత్వం,మనం 2001 నుండి జర్నలిస్ట్ లతో కొనసాగిస్తున్న అనుబంధమే కారణమని అల్లం నారాయణ తెలిపారు.  మూడో సారి అధికారికంగా అకాడమీ చైర్మెన్ పదవి చేపట్టిన అందుకు మరింత భాద్యతయుతంగా ఉండి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇందుకు అంకితమవుతాని  తెలిపారు. . జర్నలిస్టుల అందరి సహకారం ఇలాగే ఉండాలని కోరుతూన్నానని, ఈ  సందర్బంగా అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ......

ఏసీబీ వలలో ఇల్లందు మునిసిపల్ ఎఈ అనిల్ 75 వేలతో 

Image
  ఏసీబీ వలలో ఇల్లందు మునిసిపల్ ఎఈ  అనిల్  75  వేలతో 

వెంగలి బిక్షపతిని అరెస్ట్ 1.2 కోట్ల సొత్తు స్వాధీనం

Image
వెంగలి బిక్షపతిని అరెస్ట్ 1.2 కోట్ల సొత్తు స్వాధీనం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం X రోడ్డు వద్ద దుబ్బాక కు చెందిన వెంగలి బిక్షపతిని అరెస్ట్ చేసిన పోలీసులు..అతని వద్ద నుంచి (38) తులాల బంగారం, (71) తులాల వెండి, నగదు 43.000 వేల రూపాయలు, మరియు జూపిటర్ స్కూటీని స్వాధీన పరుచుకున్న పోలీసులు. వీటి విలువ సుమారుగా 1.20.0000 వరకు ఉంటుందని వెల్లడించిన పోలీసులు.

ప్రైవేట్‌ స్కూళ్ళను రద్దు చేయటమే పరిష్కారం! ఆకునూరి మురళి IAS

ప్రైవేట్‌ స్కూళ్ళను రద్దు చేయటమే పరిష్కారం! ఆకునూరి మురళి IAS నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలు పెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై, సౌకర్యాలు మెరుగై విద్యాప్రమాణాలను పెంపొందుతాయి.   భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఏ దేశంలో అయినా పేదరికం పోయిందంటే, బాగా అభివృద్ధి జరిగిందంటే దానికి పునాది పాఠశాల విద్య, కాలేజి విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేది చారిత్రక సత్యం. కానీ మన దేశంలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టులకిచ్చే ప్రాజెక్టు పనుల మీద ఉన్నంత శ్రద్ధ పిల్లలకు నాణ్యత కల్గిన చదువు చెప్పించడం మీద పెట్టలేకపోతున్నారు. సివిల్ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్...

అక్రమ ఇసుక రవాణాపై దాడులు

*అక్రమ ఇసుక రవాణాపై తరచూ దాడులు నిర్వహిస్తున్న కంచికచర్ల పోలీస్..* కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ లో భాగంగా గని అత్కూరు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు... ఇసుక తరలించేందుకు మైనింగ్ అధికారులు గతంలో ఇచ్చిన బిల్లులపై ఈ రోజు తేది  సరిచేసి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మరికొందరు వద్ద గతంలో ఇచ్చిన బిల్లులు మాత్రమే ఉండటంతో మొత్తం 13 ట్రాక్టర్లను స్థానిక కంచికచెర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణకు తరలించారు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కంచికచర్ల పోలీసులు

అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన మందకృష్ణ

అమరావతి÷   అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన మందకృష్ణ  మాదిగ ఏసీ అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో టైట్ సెక్యూరిటీ  ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని  డిమాండ్    ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు   ఎక్కడికక్కడ ఎమ్మార్పీఎస్   నేతలు కార్యకర్తలను అరెస్టు

పంచాంగం 🌓 30.07.2019

🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞 🕉 పంచాంగం 🌓 30.07.2019 సంవత్సరం: వికారి ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ పక్షం: కృష్ణ బహుళ తిథి:‌ త్రయోదశి ప.01:02 వరకు తదుపరి చతుర్దశి   వారం: మంగళవారం (భౌమ వాసరే)   నక్షత్రం: ఆర్ద్ర సా.04:10 వరకు తదుపరి పునర్వసు యోగం: హర్షణ, వజ్ర   కరణం: వణిజ వర్జ్యం: రా.తె.03:40 - 05:12  దుర్ముహూర్తం: 08:29 - 09:21 రాహు కాలం: 03:36 - 05:13 గుళిక కాలం: 12:22 - 01:59 యమ గండం: 09:08 - 10:45   అభిజిత్ : 11:57 - 12:47 అమృత కాలం: ఉ.07:27 - 08:57 సూర్యోదయం: 05:54 సూర్యాస్తమయం: 06:50 వైదిక సూర్యోదయం: 05:58 వైదిక సూర్యాస్తమయం: 06:46 చంద్రోదయం: 03:45 చంద్రాస్తమయం: 05:16 సూర్య సంచార రాశి: కర్కాటకం చంద్ర సంచార రాశి: మిథునం దిశ శూల: ఉత్తరం చంద్ర నివాసం: పశ్చిమం ☘ మాసశివరాత్రి☘ 🚩 యతినాం చాతుర్మాస్యం 🚩 🔯 🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞

టిక్ టాక్ మోజు.. అడవిలో తప్పిపోయాడు.........

టిక్ టాక్ మోజు.. అడవిలో తప్పిపోయాడు......... తిరుపతి: టిక్ టాక్ మోజులో పడి ఓ విద్యార్ది అడవికెళ్లి వీడియోలు తీసి దారి తప్పి ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది.  కలకడ మండలానికి చెందిన మురళి అనే యువకుడు తిరుపతిలోని  విద్యానికేతన్ విద్యాసంస్థలలో  మైక్రోబయాలజీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. టిక్ టాక్ మోజులో పడ్డ మురళి వినూత్నంగా సెల్ఫీ వీడియోలు తీద్దామని శేషాచలం అడవుల బాట పట్టాడు. వీడియోలు అయితే బాగానే తీసుకున్నాడు కానీ.. ఈ తర్వాత తాను వచ్చిన దారి మాత్రం మరచిపోయాడు.  తిరిగి వచ్చే దారి తెలియక ఆ అడవిలో మరో చోటుకు వెళ్లాడు. తాను దారి తప్పానని గ్రహించిన మురళి తన ఫ్రెండ్స్ కి లొకేషన్ షేర్ చేసి తానున్న పరిస్థితి గురించి తెలిపాడు. అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మురళిని రక్షించడానికి ఆదివారం అర్ధరాత్రంతా అడవిని జల్లెడ పట్టారు.  అతనికి ఫోన్ ఎలాంటి స్పందన లేకపోవడంతో గాలింపు చర్యలను తీవ్రం చేశారు. అయితే రాత్రంతా ఒంటరిగా ఉన్న మురళి భయానికి లోనై మూర్ఛకు గురైయ్యాడు . ఎట్టకేలకు మురళిని గుర్తించిన పోలీసులు వైద్యం కోసం రుయా ఆసుపత్రికి తరలిం...

మ్యాన్ వర్సెస్ వైల్డ్ : అడ్వెంచర్ టీవీ షోలో ప్రధాని మోదీ........

మ్యాన్ వర్సెస్ వైల్డ్ : అడ్వెంచర్ టీవీ షోలో ప్రధాని మోదీ........ భారత ప్రధాని నరేంద్రమోదీ నిజంగానే ఓ అడ్వెంచర్ చేశారు. టీవీలో రాబోతున్న ఓ అడ్వెంచర్ షోలో ప్రధాని మోదీ కనిపించనున్నారు. అది కూడా మామూలు అడ్వెంచర్ కాదు. అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ షో చేయడం. మీకు డిస్కవరీ ఛానల్ చూసే అలవాటు ఉంటే ఈ షోపై ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఓ వ్యక్తి అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ ఉంటారు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' పేరిట ప్రసారమయ్యే ఈ షోలో ఇప్పుడు మోదీ కూడా పాల్గొన్నారు. ఓ యువకుడితో కలిసి మోదీ కూడా అడవుల్లోకి ప్రవేశించి అక్కడి జంతుజాలాలు, పాములు వంటి వాటి మధ్య తిరుగుతూ వాటిని పరిశీలించారు. ఈ షో ఆగస్టు 12వ తేదీన టీవీల్లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. దీనిని ట్విట్టర్ లో షేర్ చేయగా... చాలా మంది దీనిని చూసి షాకవ్వడం విశేషం. ఈ ప్రోమోలో మోదీ నదిలో పడవలో ప్రయాణించడం, అడవిలో మృగాల నుంచి కాపాడుకునేందుకు బడసెలను చేత పట్టుకొని కనిపించారు. ఉత్తరాఖండ్ అడవుల్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో దీనిని షూట్ చేశారు. వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమం...

ఐటీ ఉద్యోగిని రేప్‌కేసులో 35ఏళ్ల జైలు

*ఐటీ ఉద్యోగిని రేప్‌కేసులో 35ఏళ్ల జైలు*                                                                                                                   12 ఏళ్ల క్రితం పుణెలోని ఐటీ సంస్థలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన విప్రో బీపీఓ ఉద్యోగినిపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు 35 సంవత్సరాల జైలు శిక్ష పడింది. సోమవారం బాంబే హైకోర్టు ఉరిశిక్షను జైలు శిక్షకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. 2007లో 22 ఏళ్ల యువతి మీద పురుషోత్తం బోరాటె, ప్రదీప్ కొకడే ఈ దారుణానికి ఒడిగట్టారు. 2017లో దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంతో పాటు సుప్రీం కోర్టు సెషన్స్‌ కోర్టు తీర్పును సమర్ధించింది. తమ ఉరిశిక్షను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని పురుషోత్తం, ప్రదీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. అ...

*రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవు : సిఐ సురేష్*

Image
*రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవు : సిఐ సురేష్* నల్గొండ : రోడ్లపై వాహనాలను అడ్డగోలుగా పార్కింగ్ చేసినా, షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేసినా చర్యలు తప్పవని నల్గొండ ట్రాఫిక్ సిఐ సురేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ రిలయన్స్ షాపింగ్ మాల్ నుండి అన్ని షాపుల వద్ద ఆర్.పి.రోడ్, హైద్రాబాద్ రోడ్ లోని హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్, భరద్వాజ్ ఆసుపత్రి ప్రాంతంలో రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాల పై ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత షాపింగ్ మాల్స్, దుకాణాల యజమానులతో ప్రత్యేకంగా మాట్లాడి తమ దుకాణాలకు వచ్చే వినియోగదారులు రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ చేస్తున్న విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు పై వెళ్లే ఇతర వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ చేసుకునే విధంగా చూసుకోవాలని చెప్పారు. రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద అధికంగా వాహనాలు రోడ్లపై నిలుపుతుండడంతో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించే విధంగా ప్రతి రోజు దృష్టి పెడతామని చెప్పారు. సెల్లార్ పార్కింగ్ కచ్చితంగా వినియోగించే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత షాపింగ్ మాల్...

చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం.. 

చిక్కడ పల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం..  అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ ని కిడ్నాప్ చేసిన దుండగులు.. హైదరాబాదులో ఆటోమొబైల్ ఫైనాన్స్ చేస్తున్న గజేంద్ర ప్రసాద్.. కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు.. గజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు నుంచి కోటి రూపాయలు తీసుకొని మొదలుపెట్టిన కిడ్నాపర్లు.. గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్యాపార లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం.. ముంబైలోని వ్యాపారవేత్తలతో గొడవలు ఉన్నట్టుగా గుర్తించినట్లు పోలీసులు..

ఫేసుబుక్‌లో అమ్మాయి ఖాతాతో ఫిషింగ్ లింక్ పంపించి

ఫేసుబుక్‌లో అమ్మాయి ఖాతాతో ఫిషింగ్ లింక్ పంపించి వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ బిటెక్ విద్యార్థిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.మౌలాలీ ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మాద్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలో ఎథికల్ హ్యాకింగ్ వర్క్‌షాపుకు హాజరై హ్యాకింగ్ గురించి నేర్చుకున్నాడు. దీంతో మెలిన సోఫియా పేరుతో ఓ ఫేసుబుక్ ఖాతాను తెరిచి జెడ్ అప్లికేషన్ ద్వారా ఫిషింగ్ లింక్‌ను పంపిస్తున్నాడు. ఇలా పంపిన ఫిషింగ్ లింక్‌ను ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి క్లిక్ చేసింది. వెంటనే ఆ యువతికి చెందిన యూజర్ నేమ్, పాసువార్డుతో పాటు ఆమె ఖాతాలో ఉన్న అన్ని వివరాలు అతని చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇలా మున్నీర్ యువతి బ్యాంక్ ఖాతాలతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. డబ్బు ఇవ్వకపోతే ఆమె సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఇన్స్‌పెక్టర్  బృందం ఐపీ అడ్రస్సు ద్వారా మునీర్ నిందితుడిగా గుర్తించి అతనిని అరెస్టు చేశారు. అతని నుంచి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట...

జైపాల్ రెడ్డి అజరామరుడు - డా శ్రవణ్ దాసోజు మాటల్లో

జైపాల్ రెడ్డి అజరామరుడు - డా శ్రవణ్ దాసోజు మాటల్లో   పుట్టిన ప్రతీ మానవుడు గిట్టక మానడు. కానీ బతికినంత కాలం నడుస్తున్న నిఘoటువువలె  సకల శాస్త్ర ప్రావిxణ్యంతో  సమాజం పట్ల పరిపూర్ణ అవగాహన ఉన్న వారు సమకాలీన రాజకీయాల్లో చాల తక్కువ మంది. వారిలో  ఒకరు కీర్తి శేషులు సూదిని జైపాల్ రెడ్డి. భగవంతుడి దర్బార్ లో మేధావుల  కొరత ఏమయినా ఏర్పడ్డదేమో తెలియదు కానీ, అకస్మాతుగా మనకి అందనట్టి అనంతలోకాలకు ఆయన్ను తీసుకెళ్లి పోయిండు. జైపాల్ రెడ్డి అసాధారణమైన వ్యక్తి, ధైర్యాxన్నికి పట్టుదలకు మారు పేరు.  అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడివలె  నిరంతరo  రాజకీయాల్లో పోరాటం చేసి  4 సార్లు  లోకసభ సభ్యుడుగా,  2 సార్లు  రాజ్యసభ సభ్యుడుగా, 3 సార్లు ఏమ్మెల్యే గా పనిచేసిన   రాజకీయ ఋషి  జైపాల్ రెడ్డి   శారీరిక సంబంధమైన పరిమితులేవి కూడా జైపాల్ రెడ్డి ని నియత్రించలేకపోయినాయి మానసిక సంకల్పంతో అవధులులేని విజయాలను సొంతం చేసుకొన్న అయన జీవితం  రానున్న తరాలకు ఆదర్శ ప్రాయం. అతి చిన్న వయస్సులో  పోలియో వస్తే విధిరాత ఇంతే అని వదిలిపెట్టకు...

నేటి పంచాంగం

శుభమస్తు తేది : 29, జూలై 2019 సంవత్సరం : వికారినామ సంవత్సరం ఆయనం : దక్షిణాయణం మాసం : ఆషాఢమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : సోమవారం పక్షం : కృష్ణ (బహుళ) పక్షం తిథి : ద్వాదశి (నిన్న రాత్రి 6 గం॥ 44 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 3 ని॥ వరకు) నక్షత్రం : మృగశిర (నిన్న రాత్రి 7 గం॥ 13 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 6 గం॥ 17 ని॥ వరకు) యోగము : వ్యాఘాతము కరణం : కౌలవ వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 35 ని॥ నుంచి  ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 7 ని॥ వరకు) అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 9 గం॥ 49 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 11 గం॥ 21 ని॥ వరకు) దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 4 గం॥ 14 ని॥ వరకు) రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు) గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు) యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు) సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు సూ...

కిడ్నాపర్ ఆచూకీ తెలియ చేస్తే లక్ష బహుమతి

Image
హైదరాబాద్ : ఉద్యోగం పెట్టిస్తానని మాయమాటలు చెప్పి ఈ నెల 23న బీఫార్మసీ అమ్మాయిని కారులో అపహరించుకు వెళ్ళిన వ్యక్తి ఆచూకీ తెలియచేస్తే లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని రాచకొంద పోలీసులు ప్రకటించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఉద్యోగం పెట్టిస్తానని నమ్మబలికి తెలుపురంగు హుందాయ్ ఐ20 ఆస్తా మోడల్ కారులో నకిలీ వాహన నంబరు ప్లేట్లు పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ39ఏక్యూ 1686తో తిరుగుతున్నడని పేర్కొన్నారు. ఫోటోలో కనిపించిన వ్యక్తి ఎక్కడైనా కనిపించినా.. అనుమానం కలిగిన క్రింది నంబర్లకు ఫోన్‌చేసి వివరాలు అందిస్తే సమాచారం తెలిపిన వారికి రూ.లక్ష పారితోషకం ఇవ్వబడునని తెలిపారు. వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఫోన్ చేయాల్సిన నంబర్లు హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ 9490617161 , రాచకొండ పోలీసు కంట్రోల్ రూం 9494721100 , రాచకొండ పోలీస్ కమిషనరేట్ వాట్పాప్ నెంబరు 9490617111 నంబర్లను సంప్రదించాలని పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

జైపాల్ రెడ్డి మృతికి సిపిఐ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం

జైపాల్ రెడ్డి మృతికి సిపిఐ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం ఉత్తమ పార్లమెంటేరియన్ మిర్యాలగూడ మాజీ పార్లమెంట్ సభ్యుడు సూదిని జైపాల్ రెడ్డి మృతికి  సిపిఐ నల్గొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్న దని సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండలో విద్యాభ్యాసం చేసాడని మొదటి నుంచి నల్లగొండ జిల్లా తో విడదీయలేని బంధం ఉందని తెలిపారు. రెండు సార్లు మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్ని క అయ్యారని, జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయాల్లో కల్మషం లేని మనిషి గా అందరితో కలిసి మెలిసి ఉండే వారని అన్నారు. జైపాల్ రెడ్డి గారి మృతికి  సిపిఐ నల్లగొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుందని పేర్కొన్నారు.                                    

పేద వైశ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నది-ఉప్పల శ్రీనివాస్

Image
పేద వైశ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నది-ఉప్పల శ్రీనివాస్ ఆదివారం రోజు ఉత్తరఖాండ్  ఇంటర్నేషల్ వైశ్ ఫెడరేషన్ అధ్యక్షులు సోహన్ లాల్ గుప్త ఆధ్వర్యంలో డెహ్రాడూన్ లో జరిగిన వైశ్య మహా సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా హాజరైన ఐవిఎఫ్ సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసంగిస్తూ   దేశంలో పేరుకుపోయిన పెద్ద సమస్య  పేదరికమని దానికి వైశ్యులు కూడ అతీతులు కాదని ఒకప్పుడు వెలుగు వెలిగిన వైశ్య జాతి ప్రస్తుత కాలంలో   కొన్ని లక్షల వైశ్య కుటుంబాలు పేదరికంలో  మగ్గుతున్నాయని వారిని ఆదుకునే బాధ్యత మన అందరి మీద ఉందని ,పేద ఆర్య వైశ్యులను ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి బిజెపి నేషనల్ వైస్ ప్రెసిడెంట్  శ్యామ్ జాజు, ఉత్తరఖాండ్ మరియు ఢిల్లీ బిజెపి ఇంచార్జ్ అశోక్ అగర్వాల్ , వివిధ రాష్ట్రాల ఐవీఫ్ నాయకులు  హాజరయ్యారు. 

నాన్న గురించి టీవీ ఛానల్ లో వస్తున్న వార్తలో వాస్తవం లేదు ...

Image
https://youtu.be/rbgrsuQBY08   విక్రమ్ గౌడ్ ...మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు  ప్రస్తుతం నాన్నకు ట్రీట్మెంట్ జరుగుతుంది ... నాన్న గురించి టీవీ ఛానల్ లో వస్తున్న వార్తలో వాస్తవం లేదు ... పరిస్థితి విషమంగా ఉన్న మాట వాస్తవమే .. అనుకోనిది ఏమైనా జరిగితే మేమే తెలియచేస్తాం  దయచేసి మీడియా మిత్రులు సహకరించగలరు ..

జైపాల్ రెడ్డి భౌతికకాయానికి  ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి

Image
జైపాల్ రెడ్డి భౌతికకాయానికి  ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి..ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. సీఎం కేసీఆర్ తోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు కే కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్ , పల్లారాజేశ్వర్ రెడ్డి, పలువురు నేతలు జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం రాష్ట్రప్రభుత్వం అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది. 

రవిశేఖర్‌ కేసులో మరో ట్విస్ట్‌! హయత్‌నగర్‌ ఘటనకు ముందు ఇద్దరు మహిళలను మోసగించిన వైనం

Image
రవిశేఖర్‌ కేసులో మరో ట్విస్ట్‌! హయత్‌నగర్‌ ఘటనకు ముందు ఇద్దరు మహిళలను మోసగించిన వైనం టీవీల్లో చూసి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి సీతానగరం (తూ.గో): హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. కారులో అపహరించుకుని వెళ్లిన ఘటనలో నిందితుడిగా ఉన్న రవిశేఖర్‌ కేసులో మరో మోసం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇద్దరు మహిళలను మభ్యపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హయత్‌నగర్‌ యువతి కిడ్నాప్‌కు ముందే ఈ ఘటన జరగ్గా.. రెండు మూడ్రోజుల నుంచి టీవీలో వస్తున్న కథనాలను చూసి బాధితులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. ఈ వ్యవహారంలో సీతానగరం ఎస్సై ఆనందకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 20న (శనివారం) స్థానిక బస్టాండు సెంటర్‌లో ఓ మహిళ.. ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఈలోపు నిందితుడు రవిశేఖర్‌ కారులో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చి ఏ ఊరు అంటూ ఆమెను పరిచయం చేసుకున్నాడు. తాను అటుగా వెళ్తున్నా అంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. విజయవాడ కలెక్టరేట్‌లో తాను ఉద్యోగినని నమ్మబలికాడు. గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టమని.. అందుకే ఇలా వచ్చానని చెప్పాడు....

విద్యుత్ షాకతో మృతి

Image
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట లో విద్యుత్  షాక్తో వ్యక్తి మృతి మిర్యాలగూడ కు సంబంధించిన సాయి కుమార్ (22)   బైక్ పై సూర్యాపేట వెళ్తుండగా పైనుండి కరెంటు వైరు తెగి అతని పై పడటంతో అక్కడికక్కడే మృతి

పోలీసు విధులకు బంగం కల్పించిన ఏడుగురు లారీ యజమానుల అరెస్ట్

పోలీసు విధులకు బంగం కల్పించిన ఏడుగురు లారీ యజమానుల అరెస్ట్ గత కొద్ది రోజులుగా సిర్పూర్ పేపర్ మిల్లు  యజమాన్యం, లారీ అసోసియేసన్ సబ్యులకు మద్య గొడవలు జరుగుతున్నా యని, ఈ గొడవల వల్ల  జిల్లాలో 30 పోలీసు ఆక్ట్ అమలులో ఉండగా  లారీ అసోసియేసన్ సభ్యులను రెచ్చగొట్టి పబ్లిక్ రోడ్డు పై గందరగోళం చేసిన 7 లారీ యజమానులను అరెస్టు చేసి ఆదివారం రిమాండ్ కు పంపినట్లు కాగజ్ నగర్  సిఐ .టి కిరణ్ తెలిపారు. అసోసియేషన్ భవనం దగ్గర నిలిపి ఉంచిన లారీ కి నిప్పు పెట్టి అల్లర్లు సృస్టిస్తూ పోలీసు విధులకు భంగం  కలిగించారని, అందువల్ల వారిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. అరెస్టయినవారిలో  వెన్న వెంకట కిషోర్ బాబు, ధోబి శంకర్,  మహమ్మద్ తాజ్, యూసుఫ్ ఖాన్, ఖాజా ఫసియోద్దీన్,తాహెర్ హుస్సేన్ , మాచర్ల శ్రీనివాస్ లున్నారని ఆయన తెలిపారు.  వీరిని ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు పట్టణ సి‌ఐ శ్రీ కిరణ్ గారు తెలిపినారు.

తొలి బోనం సమర్పించిన కల్వ సుజాతగుప్త

Image
  https://youtu.be/x_JsQ_YdajI   ఆదివారం  రోజు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలంలో జరిగిన బోనాల పండుగ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరై తోలి బోనాన్ని సమర్పించిన కల్వ సుజాత గుప్త టిపిసిసి అధికార ప్రథినిధి తెలంగాణ ఆరవైశ్య మహిళా విభాగ్ కోశాధికారి ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అద్యక్షురాలుకోక్కిరాల సురేఖ గ తదీతరు పాల్గోన్నారు

భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్న బాధితులు... 

Image
https://youtu.be/9FHNf9RB2T0   భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్న బాధితులు...  సూర్యాపేట మెయిన్ రోడ్ , పోస్టాఫీస్ నుంచి పొట్టి శ్రీ రాములు సెంటర్ వరకు  490 మడిగలను కులగొడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు ఎలాంటి నోటీసులు లేకుంటే అధికారుల అత్యుత్సాహం అక్కడ 1978దుకాణాలు నుంచి ఉన్నాయని బాధితుల ఆవేదన.      భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్న బాధితులు. 

490 మడిగలను కూలగొడతున్న అదికారులు 1978 నుండి ఉన్నామని ఆవేదన చెందుతున్న భాదితులు

Image
490 మడిగలను కూలగొడతున్న అదికారులు 1978 నుండి ఉన్నామని ఆవేదన చెందుతున్న భాదితులు సూర్యాపేట మెయిన్ రోడ్ , పోస్టాఫీస్ నుంచి పొట్టి శ్రీ రాములు సెంటర్ వరకు  490 మడిగలను కులగొడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు. ఎలాంటి నోటీసులు లేకుంటే అధికారుల అత్యుత్సాహం అక్కడ 1978దుకాణాలు నుంచి ఉన్నాయని బాధితుల ఆవేదన

సూర్యాపేట పట్టణంలో రోడ్ల విస్తరణ ప్రారంభించిన అధికారులు....

Image
   సూర్యాపేట పట్టణంలో రోడ్ల  విస్తరణ ప్రారంభించిన అధికారులు.... 

సంతాపం తెలిపిన నేతి

 హైదరాబాద్:- కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నేతి విద్యాసాగర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  - ఉత్తమ పార్లమెంటేరియన్ గా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.  - జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు: సీఎం కేసీఆర్*

*పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు: సీఎం కేసీఆర్* కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి అంత్యక్రియల విషయమై, టీఆర్ఎస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి స్మారకానికి స్థలాన్ని కేటాయిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ వెల్లడించారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని, ఆపై ఆ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మారుస్తామని అన్నారు. జైపాల్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ప్రజల కల ఫలించడం వెనుక ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో తనకు తెలుసునని అన్నారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తిరుమల బ్రహ్మోస్తావాలు

తిరుమల :  తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ప్రారంభమై అక్టోబరు 8వరకు జరగనున్నాయి.  ఇందులో భాగంగా సెప్టెంబరు 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు.  29న రాత్రి 7-9 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.  30న సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.  ఉదయం 9-11గంటల మధ్య, రాత్రి 8- 10 గంటల మధ్య వాహన సేవలు ఉంటాయి.  అక్టోబరు 4న సాయంత్రం 7గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ గరుడసేవ, 5న సాయంత్రం సాయంత్రం 4-6 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు.  8న రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కాంగ్రెస్ ‌సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మృతి

Image
*సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి గారు ఈ అర్థరాత్రి 1:28 లకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.* జైపాల్ రెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 16 జనవరి 1942 లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై మక్కువ ఎక్కువ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీష్ లిటరేచర్,BCJ అభ్యసించారు. OUలో విద్యార్థి నాయకుడిగా ఉంటూ... 1969లో  తొలి సారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 1969 నుంచి 1984 దాకా కాంగ్రెస్.. జనతా పార్టీల అభ్యర్థిగా కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందుతూ వచ్చారు. 1984 లో తెలుగుదేశం పార్టీ పొత్తు తో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారి విజయం సాధించారు. 1998లో కూడా మహబూబ్ నగర్  ఎంపీగా గెలిచారు. అనంతరం 1999.. 2004 సంవత్సరాలలో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో చేవెళ్ల  స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఎంపీగా విజయం సాధించారు 1990,1996 లలో రాజ్యసభ సభ్యుడిగా కూడా జైపాల్ రెడ్డి కొనసాగారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. 2004 ..2009 కాంగ్రెస్ హయాంలో కూడా కేంద్రమంత్రిగా జైపాల్...

ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలి - షణ్ముఖ

Image
ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న  వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి వారిని అన్ని విదాలుగా కెంద్ర        ప్రభుత్వం ఆదుకొవాలని కోరుతూ  లోకసభ స్పీకర్   ఓంబిర్లా కి వినతి పత్రం ఇచ్చామని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజు షణ్ముఖ తెలిపారు.  వినతి పత్రం ఇచ్చనవారిలో ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పాల్గొన్న పలువురు పాల్గోన్నారు.

ఇంకుడు గుంతల పట్ల మరింత అవగాహన కల్పించాలి : పద్మనాభ రెడ్డి*

Image
  *ఇంకుడు గుంతల పట్ల మరింత అవగాహన కల్పించాలి : పద్మనాభ రెడ్డి* https://youtu.be/3R5iKFBWOoE నల్గొండ :  ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల వాన నీటిని సంరక్షించుకోవడంతో పాటు భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని, ఇంకుడు గుంతల ప్రధాన్యతపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని జిల్లా అదనపు ఎస్పీ పద్మనాభ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయగా వాటిని అదనపు ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సమస్యలను అధిగమించే విధంగా ముందుకు సాగాలని ప్రజలను కోరారు. ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల కలిగే లాభాలు, భావి తరాలకు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చేసిన వాళ్లవుతామని చెప్పారు. పెద్ద ఎత్తున వినియోగిస్తున్న ప్లాస్టిక్ కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకుడు గుంటలపై ప్రజలలో మరింత చైతన్యం తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్పీ రమేష్, వ్యవసా...

వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్..

వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్.. ఏరియల్ వ్యూ.. బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు, నిమిష నిమిషానికీ పెరుగుతున్న వరద.. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై-కొల్లాపూర్ మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. 700మంది ప్రయాణికులు తిండీనీళ్లు లేక అల్లాడిపోతున్నారు. బద్లాపూర్, వంగని స్టేషన్ల మధ్య..వరద ప్రవాహం ఎక్కువ కావడంతో డ్రైవర్ రైలుని ఆపేశాడు. ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయడంతో విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. వెంటనే రైల్వే ఉన్నతాధికారులు అప్రమత్తమై ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాయి. మరోవైపు నేవీ దళం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అతి కష్టమ్మీద నేవీ దళం రైలు వద్దకు చేరుకుని 9మందిని సురక్షితంగా బైటకు తీసుకురాగలిగారు. ప్రయాణికులలో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రైల్ ఫుట్ బోర్డ్ వరకు వరదనీరు చేరుకోవడంతో ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. రైల్వే అధికారులు వారికి ధైర్యం చెబుతున్నా పరిస్థితి నిమిష నిమిషానికీ మరీ దారుణంగా తయారవుతోంది. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఏ క్షణాణ ఏం జరుగుతుంద...

గాసిప్స్ నమ్మొద్దు.. నేను బాగానే ఉన్నాను.........

గాసిప్స్ నమ్మొద్దు.. నేను బాగానే ఉన్నాను......... సెలెబ్రిటీలు ఏం చేసినా వార్తే. కానీ ఒక్కోసారి వాళ్లు చేసిన దాన్ని వేరేలా అర్థం చేసుకుని తప్పుడు వార్తలు పుట్టిస్తుంటారు కొందరు. రీసెంట్‌‌గా రానా విషయంలో అదే జరిగింది. ఈ మధ్య రానా విదేశాలకు వెళ్లాడు. అప్పట్నుంచి తనకి ఆరోగ్యం బాలేదని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, అందుకే సర్జరీ కోసం వెళ్లా డని… ఇలా ఏవేవో వార్తలు పుట్టుకొచ్చాయి. సోషల్‌‌ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు వైరల్‌‌ అయ్యాయి కూడా. కానీ అవన్నీ పచ్చి అబద్ధమని తేల్చేశాడు రానా. సోషల్‌‌ మీడియాలో ఓ అభిమాని అతని ఆరోగ్యం గురించి అడిగినప్పుడు రానా స్పందించాడు. తనకెలాంటి సమస్యా లేదని,  నెక్స్ట్ ప్రాజెక్ట్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి కొన్ని కంపెనీలతో మాట్లాడటానికి వచ్చానని చెప్పాడు. దాంతో ఫుల్‌‌ క్లారిటీ వచ్చేసింది. రానా వెళ్లింది 'హిరణ్య కశ్యప' ప్రాజెక్ట్ పని మీద. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ప్రాణం పెట్టి  చేస్తున్నాడు. ఇది కాకుండా 'విరాటపర్వం'తో బిజీ. బాలీవుడ్‌‌లో చేసిన హాథీ మేరె సాథీ, హౌస్​ఫుల్​ 4 రిలీజ్‌‌కి రెడీ అవుతున్నాయి. 'భుజ్​' మూవీ సెట్స్​పై ఉంది.

ముగిసిన ఫిలిం ఛాంబర్‌ తంతు.. ' మన ప్యానెల్‌ ' ఘన విజయం.

Image
ముగిసిన ఫిలిం ఛాంబర్‌ తంతు.. ' మన ప్యానెల్‌ ' ఘన విజయం.           హైదరాబాద్‌ : ఉద్రిక్తతల నడుమ సాగిన ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని 'మన ప్యానెల్‌' వర్గం ఘన విజయం సాధించింది. 'మన ప్యానెల్‌' తరఫున ఎన్నికల్లో 9 మంది విజయం సాధించగా, ప్రత్యర్థి వర్గం 'యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ ' ప్యానెల్‌ లో కేవలం దిల్‌ రాజు, దామోదర్‌ ప్రసాద్‌ మాత్రమే గెలిచారు. ఇండిపెండెంట్‌ గా బరిలో దిగిన మోహన్‌ గౌడ్‌ కూడా నెగ్గాడు. 20 మంది సెక్టార్‌ మెంబర్స్‌ లో 'మన ప్యానెల్‌' నుంచి 16 మంది గెలుపొందారు. 'మన ప్యానెల్‌' నుంచి వైవీఎస్‌ చౌదరి, నట్టి కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, ఎం.శివకుమార్‌, కేశవరావు, సాగర్‌ తదితరులు పోటీ చేయగా, 'యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌' ప్యానెల్‌ తరఫున దిల్‌ రాజు, డీవీవీ దానయ్య, కొర్రపాటి సాయి, రవిశంకర్‌, దామోదర్‌ ప్రసాద్‌, ఆచంట గోపీనాథ్‌, కేకే రాధామోహన్‌, శివలెంక కృష్ణప్రసాద్‌, భోగవల్లి ప్రసాద్‌ తదితరులు పోటీ చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తయింది.

యడియూరప్ప ప్రభుత్వంలోకి కుమారస్వామి..?

  యడియూరప్ప ప్రభుత్వంలోకి కుమారస్వామి..? ర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసినా..  ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా బీజేపీ శ్రేణుల్లో ఆ ఆనందం మాత్రం లేదు.  ఎందుకంటే యడ్డీ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్ధితుల్లో ఇది అంత తేలికైన పని కాదు. అయితే కమలనాథులు మాత్రం తదుపరి వ్యూహాలు రచిస్తున్నారు. ముగ్గురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య  221కి చేరింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయ్యింది. బీజేపీకి  ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్ధతు ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ మద్ధతు కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుక్రవారం రాత్రి కుమారస్వామి అధ్యక్షతన జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ  భేటీలో యడ్యూరప్ప ప్రభుత్వంలో చేరడమా..? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా అన్న అంశంపై ప్రధానంగా చర్చ  జరిగిన...

ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌ కథ

Image
*ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌ కథ..!*ఇకపై భార్య'లు' ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!  రెండో భార్య పిటిషన్‌పై కోర్టు కరుకైన వ్యాఖ్యలు బహుపెళ్లిళ్ల ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్‌ కేసు తమిళనాడు ప్రభుత్వానికి మదురై హైకోర్టు ఆదేశం చెన్నై: కుటుంబ నియంత్రణ చట్టం వచ్చినపుడు 'మే మిద్దరం..మాకిద్దరు' అనే నినాదం మార్మోగిపోయింది. అయినా జనాభా పెరుగుదల ఆగకపోవడంతో 'మేమిద్దరం..మాకొక్కరు' అంటూ నినాదంలో మార్పులు తెచ్చారు. అయితే కొందరు వ్యక్తులు 'నేనొక్కడిని..నాకిద్దరు భార్యలు' అంటూ పలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకునే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మదురై హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.  వివరాలు ఇలా ఉన్నాయి.     మదురైకి చెందిన తేన్‌మొళి అనే మహిళ మదురై హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నా భర్త పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఎస్‌ఐగా పదోన్నతి పొందాడు. 1982లో మాకు వివాహం కాగా ఆయనకు అంతకు ముందే ముత్తులక్ష్మి అనే మహిళతో వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు ఆలస్...

సెల్ల్ టవర్ ఎక్కిన రైతు

Image
పెద్దపల్లి జిల్లా  మంథని పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న ముత్తారం మండల ఖమ్మంపల్లికి చెందిన కట్ల రమేష్ అనే రైతు.      వ్యవసాయ భూమి ని కొనుకుంటే రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన. 

నో డాక్టర్ నో మెడిసిన్ డాక్టర్ తో  అవసరం లేదు, మందులతో పనిలేదు మీ ఆరోగ్యం మీ చెతుల్లో

Image
నో డాక్టర్ నో మెడిసిన్ డాక్టర్ తో  అవసరం లేదు, మందులతో పనిలేదు మీ ఆరోగ్యం మీ చెతుల్లో శ్రీ సత్య సాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో ఈ రోజు జులై 27 శనివారం సాయంత్రం 5 గంటలకు, ఆరోగ్యంపై ఉచిత అవగాహన సదస్సు  నల్గొండలోని బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఈ  సదస్సు లో డాక్టర్ అశోక వర్ధన్ రెడ్డి అధిక బరువుపై, సర్వేకల్  స్పాండిలైటిస్, షుగర్, బిపి, థెరయిడ్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ల కండరాల నొప్పిలపై   ఆక్యుపెంచేర్, నురోతెరిపి, సూజోక్ థెరపీ, నీళ్ల త్రాగడం ద్వారా వ్యాధులు తగ్గించుకోవడం పై  సూచనులు చేస్తారు. అనేక రకాల  జబ్బులు ఎలాంటి  మందులు వాడకుండా, డాక్టర్ తో పని లేకుండా ఎలా తగ్గించకో వచ్చో అనే దానిపై ఆయన ప్రసంగం ఉంటుందని,సదస్సుకు వచ్చేవారు నోట్ బుక్, పెన్ తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరారు. సమయానికి వచ్చి ముందే మీ సీటు రిజర్వ్ చేసుకోవాలని కోరారు.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హెచ్చరిక*

Image
_*తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హెచ్చరిక*_ _దిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే ఇరురాష్ట్రాల సీఎస్‌లు తమ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఇది వరకే దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇరురాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా కోరాయి. దీంతో తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది._

చరిత్రలో ఈ రోజు/జూలై 27*

*చరిత్రలో ఈ రోజు/జూలై 27*            *సలీం అలీ* 🌹1955 : ఆస్ట్రేలియా కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అలాన్ బోర్డర్ జననం. 🌷1967 : భారతదేశ నటుడు, రచయిత, దర్శకుడు, సామాజిక కార్యకర్త మరియు రగ్బీ యూనియన్ ఆటగాడు రాహుల్ బోస్  జననం. 🥀1970 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కేరళ ముఖ్యమంత్రి గా పనిచేసిన పీ.ఏ.థాను పిల్లై మరణం (జ.1885). 🌻1987 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ మరణం (జ.1896). 💐2002 : భారత ఉప రాష్ట్రపతి గాను, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్  గానూ పనిచేసిన కృష్ణకాంత్ మరణం (జ.1927). 🌸2003 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాస్యజీవి, రేడియో, టీవీ, సినిమా, రంగస్థలం వంటి అన్ని రంగాల్లోనూ హాస్యం అందరికీ పంచి నిండుగా నూరేళ్ళు జీవించిన ధన్యజీవి బాబ్ హోప్  మరణం (జ.1903). 🌺2015 : భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11 వభారత రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ మరణం (జ.1931).🌷🌹🌺🌸💐🥀🌻🍀🌴🍃🌿☘🌱🍂🎄🍁🌲🌼🎍

27 జులై పంచాంగం

🌞🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻 🙏🙏 శ్రీరస్తు  🙏 శుభమస్తు 🙏🙏 *🔵తేది : 27, జూలై 2019* 🔶సంవత్సరం : వికారినామ సంవత్సరం 🔷ఆయనం : దక్షిణాయణం ♦మాసం : ఆషాఢమాసం 💎ఋతువు : గ్రీష్మ ఋతువు 🌎కాలము : వేసవికాలం 🌈వారము : స్థిర(మంద)వాసరే (శనివారం) 🔰పక్షం : కృష్ణ (బహుళ) పక్షం🌗 🏵తిథి : దశమి (నిన్న రాత్రి 7 గం॥ 56 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 7 గం॥ 46 ని॥ వరకు దశమి తిధి తదుపరి ఏకాదశి తిధి) ⭐నక్షత్రం : కృత్తిక (నిన్న రాత్రి 6 గం॥ 56 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 7 గం॥ 30 ని॥ వరకు కృత్తిక నక్షత్రం తదుపరి రోహిణి నక్షత్రం) ✋యోగము : (గండ ఈరోజు ఉదయం 7 గం ll 55 ని ll వరకు తదుపరి వృద్ది రేపు ఉదయం 6 గం ll 28 ని ll వరకు) 🛑కరణం : (వణిక్ ఈరోజు ఉదయం 7 గం ll 51 ని ll వరకు) (విష్టి ఈరోజు రాత్రి 7 గం ll 40 ని ll వరకు) 🀄అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 23 ని ll) 🤢వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 13 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 8 గం॥ 51 ని॥ వరకు) 👌అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 3 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 6 గం॥ 41 ని॥ వరకు) 👽దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 5 గం॥ 43 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 7 గం॥ 28 ని॥ వరకు) 🐍ర...

పాఠశాలలు,కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి

Image
నాగార్జున సాగర్,జూలై 26.రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం నాగార్జున సాగర్ నియోజక వర్గం నందికొండ మున్సిపాలిటీ లో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల ఎస్.సి.,ఎస్.టి.వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగం పై ప్రత్యెక దృష్టి పెట్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు,ఆయన తెలిపారు.రాష్ట్రంలో కళాశాల ల్లో  విద్య నభ్యసించిన విద్యార్థి ప్రపంచంలో ఆత్మ విశ్వాసంతో పోటీ పడే విదంగా విద్యా రంగంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు వినియోగించుకొని విద్యార్థులు చదువులో రాణించాలని అన్నారు.నంది కొండ మున్సిపాలిటీ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు,మున్సిపాలిటీ నీ ఆదర్శంగా రూపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎం.ఎల్.సి తేరా చిన్నప రెడ్డి,స్థానిక శాసన సభ్యులు నోముల నర్సింహయ్య  తదితరులు పాల్...

భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు

Image
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్‌భవన్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు.  అనంతరం ఆయనకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం ఎస్‌.ఎం. కృష్ణ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర భాజపా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. 

అమెరికాలో ఘనంగా ఇద్దరు భారత "మగ ఎన్నారైల"...పెళ్లి..!!!*

Image
  అమెరికాలో ఘనంగా ఇద్దరు భారత "మగ ఎన్నారైల"...పెళ్లి..!!!* అమెరికాలోని న్యూజెర్సీ లో ఇద్దరు భారత సంతతికి చెందిన మగ ఎన్నారైలు పెళ్లి చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. మారుతున్న కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వ సాధారణం అయ్యింది. గే పెళ్ళిళ్ళు సమాజంలో చేసుకోవాలంటే భయపడే వారు గతంలో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. పైగా వీటిని సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరు భారత సంతతి మగవారు తమ పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లిని నిర్వహించుకోవాలని అనుకోవడంతో సరిపెట్టకుండా చేసి చూపించారు. భారత్ కి చెందిన అమిత్ షా, ఆదిత్య మదిరాజు ఇద్దరూ కలిసి న్యూజెర్సీ లో భారత సాంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకున్నారు. రాబిన్స్ విల్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామీ నాయరన్ మందిర్ లో వీరి వివాహం నిర్వహించబడింది. స్నేహితులు, సన్నిహితులు దగ్గర ఉండిమరీ వీరి వివాహం జరిపించడం మరో విశేషం. వీరు తీసిన ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ పెళ్లి ఎంతో ఘనంగా జరిగిందని అందుకు కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా కొత్త జంట పేర్కొంది.