కిడ్నాపర్ ఆచూకీ తెలియ చేస్తే లక్ష బహుమతి


హైదరాబాద్ : ఉద్యోగం పెట్టిస్తానని మాయమాటలు చెప్పి ఈ నెల 23న బీఫార్మసీ అమ్మాయిని కారులో అపహరించుకు వెళ్ళిన వ్యక్తి ఆచూకీ తెలియచేస్తే లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని రాచకొంద పోలీసులు ప్రకటించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఉద్యోగం పెట్టిస్తానని నమ్మబలికి తెలుపురంగు హుందాయ్ ఐ20 ఆస్తా మోడల్ కారులో నకిలీ వాహన నంబరు ప్లేట్లు పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ39ఏక్యూ 1686తో తిరుగుతున్నడని పేర్కొన్నారు. ఫోటోలో కనిపించిన వ్యక్తి ఎక్కడైనా కనిపించినా.. అనుమానం కలిగిన క్రింది నంబర్లకు ఫోన్‌చేసి వివరాలు అందిస్తే సమాచారం తెలిపిన వారికి రూ.లక్ష పారితోషకం ఇవ్వబడునని తెలిపారు.
వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఫోన్ చేయాల్సిన నంబర్లు హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ 9490617161, రాచకొండ పోలీసు కంట్రోల్ రూం 9494721100, రాచకొండ పోలీస్ కమిషనరేట్ వాట్పాప్ నెంబరు 9490617111 నంబర్లను సంప్రదించాలని పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!