జైపాల్ రెడ్డి అజరామరుడు - డా శ్రవణ్ దాసోజు మాటల్లో

జైపాల్ రెడ్డి అజరామరుడు -


డా శ్రవణ్ దాసోజు


మాటల్లో
 
పుట్టిన ప్రతీ మానవుడు గిట్టక మానడు. కానీ బతికినంత కాలం నడుస్తున్న నిఘoటువువలె  సకల శాస్త్ర ప్రావిxణ్యంతో  సమాజం పట్ల పరిపూర్ణ అవగాహన ఉన్న వారు సమకాలీన రాజకీయాల్లో చాల తక్కువ మంది. వారిలో  ఒకరు కీర్తి శేషులు సూదిని జైపాల్ రెడ్డి. భగవంతుడి దర్బార్ లో మేధావుల  కొరత ఏమయినా ఏర్పడ్డదేమో తెలియదు కానీ, అకస్మాతుగా మనకి అందనట్టి అనంతలోకాలకు ఆయన్ను తీసుకెళ్లి పోయిండు. జైపాల్ రెడ్డి అసాధారణమైన వ్యక్తి, ధైర్యాxన్నికి పట్టుదలకు మారు పేరు.  అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడివలె  నిరంతరo  రాజకీయాల్లో పోరాటం చేసి  4 సార్లు  లోకసభ సభ్యుడుగా,  2 సార్లు  రాజ్యసభ సభ్యుడుగా, 3 సార్లు ఏమ్మెల్యే గా పనిచేసిన   రాజకీయ ఋషి  జైపాల్ రెడ్డి
 
శారీరిక సంబంధమైన పరిమితులేవి కూడా జైపాల్ రెడ్డి ని నియత్రించలేకపోయినాయి మానసిక సంకల్పంతో అవధులులేని విజయాలను సొంతం చేసుకొన్న అయన జీవితం  రానున్న తరాలకు ఆదర్శ ప్రాయం. అతి చిన్న వయస్సులో  పోలియో వస్తే విధిరాత ఇంతే అని వదిలిపెట్టకుండా , పట్టుదలతో మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నిజాన్ని మరో xసరి రుజువు చేస్తూ  తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మహానుభావుడు  జైపాల్ రెడ్డి.
 
ఆయనను మొదటిసారి 1987 సంవత్సరంలో నేను ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విద్యార్థి నాయకుడుగా ఉన్నపుడు  "అవినీతిరహిత పరిపాలన" అనే అంశంపై జాతీయ స్థాయీ సమావేశం నిర్వహించడం కోసం  అబిడ్స్ xఉన్న హోటల్ సిధార్థ లో, ఆ హోటల్ యజమాని బాబులరెడ్డి గారిని మరియు  జైపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆనాడు, రాజకీయాలు అవినీతిరహితంగా ఉండకపోతే, మొత్తం సమాజం విధ్వంసం అవుతది అని అయన గట్టిగా అన్న మాటలు ఇప్పటికి నా చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి.
 
అతిసౌమ్యుడుగా వ్యవహారశైలి  కనబరిచే జైపాల్ రెడ్డి  ఒక ఫైర్ బ్రాండ్ విద్యార్ధి నాయకుడు అని, ఎదో ఒక సందర్భంలో ఆర్ట్స్ కాలేజ్ మెట్ల పై నుండి , మెట్ల క్రింద ఉన్న  తన ప్రత్యర్థులపై అమాంతంగాదునికి తన రాజిలేని మానసిక సంసిద్ధత ను  చాటుకున్నాడు అని అయన సమకాలికులు చెబుతూ ఉంటారు.  శక్తివంతమైన వాగ్దాటి అయన  సొత్తు. అందుచేతనే ఆలోచేపజేసే xప్రసంగాలు xలో పాటు రోమాలు నిక్కబొడిచే లపాటు ఆవేశపు మాటల తూటాలతో  తన తోటి  విద్యార్ధులందరిని సోషలిజం వైపు మళ్ళించాడు. విద్యార్ధి దశలో xస్వతంత్ర సమరయోధులైన  రాజగోపాలాచారి, మరియు రామ్ మనోహర్ లోహియా లాంటి వారి ప్రసంగాలకు  ప్రేరేపితులైన జైపాల్ రెడ్డి  తెలుగు గడ్డ మీద సోషలిజం సిద్ధాంతానికి  బీజం వేసిన తెలంగాణ  బిడ్డ.
 
 జైపాల్ రెడ్డి ఒక ప్రక్క  రామ్ మనోహర్ లోహియా  సిద్ధాంతాలను  వంటపట్టించుకొని, మరో ప్రక్క ఆయన జవహర్ లాల్ నెహ్రు సిద్ధాంతాలను   అంతే బలంగా అవపోసన పట్టిన ఆధునిక రాజకీయ శాస్త్రవేత్త. అంతేకాదు జవహర్ లాల్ నెహ్రు  భారత దేశానికి మొట్టమొదటి ప్రధాని కాక పోయెండె భారతదేశ అస్థిత్యం ప్రమాదంలో పడేది, భారత దేశానికి  పరిణతి  చెందిన ప్రజాస్వామ్యం వ్యవస్థగా ఎదిగి ఉండేది కాదు అని బల్ల కొట్టి వాదించే ఆయన సరళీకృత ప్రజాస్వామ్యవాది.
 
పదవులను వదులుకుంటాను కానీ, విలువలు మాత్రం కాదు అనే నిఖార్సైన నిబద్దత తో వ్యవహరించిన మహా నాయకుడు జైపాల్ రెడ్డి. ఆ రోజుల్లో కేంద్ర పెట్రోలియం శాఖకు వ్యాపారస్థులైన అదానీ కానీ అంబానీ కానీ వస్తే, సంబంధిత శాఖ మంత్రులతో పాటు, మొత్తం అధికార యంత్రాగం యెర్ర తివాచి వేసి స్వాగతం చెప్పే వారట. కానీ జయపాల్ రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖకు మంత్రిగా ఉన్న రోజుల్లో కేజీ బేసిన్ కు సంబంధించి అవినీతి ఆరోపణలున్న అంబానీకి ఒక్క నిముషం అపాయింట్మెంట్ కూడా ఇవ్వను గాక ఇవ్వను అని భీష్మించుకుని ఆ పైగా అంబానీ ముక్కుకు తాడు వేసి మరీ దాదాపు 32 వేల కోట్ల జుర్మానా కట్టించుకున్న గట్టి ధైర్యశాలి.
 
ఏ పదవి చేపట్టిన తనదైన ప్రత్యేక ముద్ర వేసి సంస్కరణలు తెచ్చిన పరిపాలనాదక్షుడు.. ఇవ్వాళ పత్రిక రంగం అభివృద్ధి చెందిందంటే, పత్రిక స్వేచ్చ ఇంతగా ఉందంటే కారణం అయన సమాచార  మంత్రిగా  ప్రసార భారతి బిల్లు ద్వార అయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మాత్రమే. కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా అనేక జాతీయ రోడ్డు రహదారులు నిర్మించారు. ఇవ్వాళా హైదరాబాద్ లో మనం సగర్వంగా వినియోగిస్తున్న మెట్రో రైల్ కు నాధుడు ఆయనే. 28 వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులు  కేటాయించి  మెట్రో రైల్ నిర్మానికి స్వీకారం చుట్టాడు. ఎడారిగా మారుతున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ఎత్తి పోతల ప్రాజెక్ట్ కు ఆయనే ఆద్యుడు. ఆ రోజుల్లో గ్యాస్ స్టేషన్స్, పెట్రోల్ బంకులన్నీ ఆరోజుల్లో కేవలం పైరవీ కారులకు మాత్రమే వచ్చేవి. , లాటరీ విధానం ను ప్రవేశపెట్టి  అప్పటిదాకా కొనసాగుతున్న అవినీతిని అంతమొంచిన చరిత్ర ఆయనది. ఇవాళ్టి కూడా ఆయన ప్రవేశ పెట్టిన విధానం కొనసాగుతుంది.
 
తెలంగాణ ఇవ్వకుండ ఒకానొక దశలో నిన్ను ముఖ్యమంత్రిని చేస్థం xఅనే ప్రతిపాదనలు వస్తే, నాకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి కాదు, తెలంగాణ ప్రజల విముక్తి అని నిష్కర్షగా తిరస్కరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడ్డడు. తెలంగాణ సాధన కోసం ఓ ప్రక్క ఆనాటి ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజ నరసింహ కాంగ్రెస్ వర్కింగ్ కమటీ ని ఒప్పించే ప్రయత్నం చేస్తే, మరో ప్రక్క నిశ్శబ్ద సైనికుడి వలే, జైపాల్ రెడ్డి గారు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించిన అతి కీలక పాత్ర పోషించిన తెలంగాణ మట్టి బిడ్డ. చాలామందికి తెలియని రహస్యం ఏమిటంటే,  యు పి ఏ  చైర్ పర్సన్ అయిన సోనియాగాంధీని ఒప్పించడంలో అయన  చేసిన కృషి అనన్యమైనది. అంతేకాదు ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు సైతం ఉద్యమ సమయంలో, మరీ ముఖ్యంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడుతున్న సమయంలో,  జైపాల్ రెడ్డి తో నిరంతర సంబంధాలు నెరుపుతూ, అనేక అంశాలపై పలుమార్లు చర్చలు చేసిన విషయము  చాల మందికి తెలియక పోవచ్చు.
 
బహుశా తెలంగాణ గడ్డ మీద పి వి నరసింహ రావు తరువాత అంతటి మేధావి కేవలం  జైపాల్ రెడ్డి మాత్రమే అంటే అతియోశక్తి గాదు. ఆయనతో పాటు గాంధీ భవన్ లో పలు పత్రికా సమావేశాల్లో  పాల్గొనే అదృష్టం కలిగింది. ఆచి తూచి ఇంగ్లీష్ మరియు తెలుగులో అయన మాట్లాడిన ప్రతి మాట ఒక తూటా లాంటిది. పత్రిక సమావేశ ప్రసంగాలలో  అయన చేసిన పద ప్రయోగాలు విస్ఫోటనం లాంటివి. అంతే కాదు ఆనాటి పిసిసి అధ్యక్షులైన  పొన్నాల లక్ష్మయ్య నేతృత్వం లో “విజన్ అఫ్ తెలంగాణ” అనే అంశం పై 2014 డిసెంబర్ నెలలో శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్బంగా అద్దంకి దయాకర్ తో కలిసి   నేను నిర్వహించిన సదస్సులో ఆశ్చర్యం కల్గించే విధంగా దాదాపు ఆరున్నర గంటల పాటు లేవకుండా కూర్చొని తన అభిప్రాయాలూ చెప్పడంతో పాటు, ఒక విద్యార్థి వలే అందరి అభిప్రాయాలు  విన్న  జైపాల్ రెడ్డి  ఓర్పు తెలంగాణ అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని చెబుతుంది.


తిరుపతి వెంకటకవులవలె నేను మరియు జైపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళం అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిన్న అన్నారంటే, జైపాల్ రెడ్డి  గారి వాదన పటిమ ఎంతో అర్ధం చేసుకోవచ్చు. అసెంబ్లీ లో కానీ, పార్లమెంటులో కానీ జైపాల్ రెడ్డి మాట్లాడిండు అంటే, శత్రువు కూడా సానుకూలంగా వినాల్సిందే. అయితే,  పచ్చి బూతు ప్రసంగాలు చేస్తూ, ఆఖరికి చట్టసభల్లో సైతం కాకిరి భీకిరి అంటూ తిట్టుకుంటూ, కోట్లాడే  ఈ తరం నాయకులు పదునైన భాష తో పటు సున్నితమైన హాస్యం తో అయన చేసిన గంభీర ప్రసంగాలనువిని నేర్చుకోని వారి వికృత శైలిని మార్చుకోవాలి. .
 
జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సరే, వెంకయ్య నాయుడితో సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయనను ఆత్మీయుడిగా భావించి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారంటే, అజాత శత్రువైన ఆయన వ్యక్తిత్వానికి ప్రతీక. తన శారీరక పరిమితులను అధిగమించి, విజయపథంలో కొనసాగిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం. సమకాలీన సామాజిక చరిత్రను చదవడం తో పాటు, నీతి, నిజాయితీ మరియు విలువలతో కూడుకున్న రాజకీయాలను ఆచరించడం మాత్రమే  జైపాల్ రెడ్డి కి మనమిచ్చే అతిపెద్ద నివాళి.
 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్