మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శాంతినగర్ లో దారుణం.
రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి లో దారుణం చోటుచేసుకుంది.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం...
హైదరాబాద్: కళ్లు నెత్తికెక్కిన ఓ కామాంధుడు అభం శుభం తెలియని మూడు సంవత్సరాల చిన్నారి పైన అత్యాచారం చేసిన సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సత్తయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రుబీనా అనే మహిళ గత కొంతకాలంగా కాటేదన్ ప్రాంతంలోని శాంతినగర్ లో నివాసం ఉంటుందని వీరి స్వస్థలం బీహార్ కాగా పొట్ట కూటి కోసం కాటేదాన్ నివాసం ఉంటున్నారని మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు రుబినా చిన్న కుమార్తె మూడు సంవత్సరాల వయసు గల పాపను తన మేనల్లుడు రాజు, ఉద్దేశపూర్వకంగానే అంగన్వాడి సెంటర్ నుంచి మధ్యాహ్నం తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, రాత్రి సమయంలో ఇంటి దగ్గర విడిచి పెట్టి వెళ్లిపోయారని బాధితురాలు తల్లి ఫిర్యాదు చేసిందని ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు.
Comments
Post a Comment