వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్..

వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్..


ఏరియల్ వ్యూ..



బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు,


నిమిష నిమిషానికీ పెరుగుతున్న వరద..

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై-కొల్లాపూర్ మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. 700మంది ప్రయాణికులు తిండీనీళ్లు లేక అల్లాడిపోతున్నారు. బద్లాపూర్, వంగని స్టేషన్ల మధ్య..వరద ప్రవాహం ఎక్కువ కావడంతో డ్రైవర్ రైలుని ఆపేశాడు. ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయడంతో విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. వెంటనే రైల్వే ఉన్నతాధికారులు అప్రమత్తమై ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాయి. మరోవైపు నేవీ దళం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అతి కష్టమ్మీద నేవీ దళం రైలు వద్దకు చేరుకుని 9మందిని సురక్షితంగా బైటకు తీసుకురాగలిగారు. ప్రయాణికులలో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రైల్ ఫుట్ బోర్డ్ వరకు వరదనీరు చేరుకోవడంతో ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. రైల్వే అధికారులు వారికి ధైర్యం చెబుతున్నా పరిస్థితి నిమిష నిమిషానికీ మరీ దారుణంగా తయారవుతోంది. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఏ క్షణాణ ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడిపోతున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్