అమెరికాలో ఘనంగా ఇద్దరు భారత "మగ ఎన్నారైల"...పెళ్లి..!!!*

 


అమెరికాలో ఘనంగా ఇద్దరు భారత "మగ ఎన్నారైల"...పెళ్లి..!!!*


అమెరికాలోని న్యూజెర్సీ లో ఇద్దరు భారత సంతతికి చెందిన మగ ఎన్నారైలు పెళ్లి చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. మారుతున్న కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వ సాధారణం అయ్యింది. గే పెళ్ళిళ్ళు సమాజంలో చేసుకోవాలంటే భయపడే వారు గతంలో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. పైగా వీటిని సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరు భారత సంతతి మగవారు తమ పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లిని నిర్వహించుకోవాలని అనుకోవడంతో సరిపెట్టకుండా చేసి చూపించారు. భారత్ కి చెందిన అమిత్ షా, ఆదిత్య మదిరాజు ఇద్దరూ కలిసి న్యూజెర్సీ లో భారత సాంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకున్నారు.


రాబిన్స్ విల్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామీ నాయరన్ మందిర్ లో వీరి వివాహం నిర్వహించబడింది. స్నేహితులు, సన్నిహితులు దగ్గర ఉండిమరీ వీరి వివాహం జరిపించడం మరో విశేషం. వీరు తీసిన ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ పెళ్లి ఎంతో ఘనంగా జరిగిందని అందుకు కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా కొత్త జంట పేర్కొంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్