మ్యాన్ వర్సెస్ వైల్డ్ : అడ్వెంచర్ టీవీ షోలో ప్రధాని మోదీ........

మ్యాన్ వర్సెస్ వైల్డ్ : అడ్వెంచర్ టీవీ షోలో ప్రధాని మోదీ........



భారత ప్రధాని నరేంద్రమోదీ నిజంగానే ఓ అడ్వెంచర్ చేశారు. టీవీలో రాబోతున్న ఓ అడ్వెంచర్ షోలో ప్రధాని మోదీ కనిపించనున్నారు. అది కూడా మామూలు అడ్వెంచర్ కాదు. అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ షో చేయడం. మీకు డిస్కవరీ ఛానల్ చూసే అలవాటు ఉంటే ఈ షోపై ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది.


ఓ వ్యక్తి అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ ఉంటారు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' పేరిట ప్రసారమయ్యే ఈ షోలో ఇప్పుడు మోదీ కూడా పాల్గొన్నారు. ఓ యువకుడితో కలిసి మోదీ కూడా అడవుల్లోకి ప్రవేశించి అక్కడి జంతుజాలాలు, పాములు వంటి వాటి మధ్య తిరుగుతూ వాటిని పరిశీలించారు. ఈ షో ఆగస్టు 12వ తేదీన టీవీల్లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. దీనిని ట్విట్టర్ లో షేర్ చేయగా... చాలా మంది దీనిని చూసి షాకవ్వడం విశేషం.


ఈ ప్రోమోలో మోదీ నదిలో పడవలో ప్రయాణించడం, అడవిలో మృగాల నుంచి కాపాడుకునేందుకు బడసెలను చేత పట్టుకొని కనిపించారు. ఉత్తరాఖండ్ అడవుల్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో దీనిని షూట్ చేశారు. వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మోదీ ఈ షోలో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్