ఫరూక్ నగర్ సబ్ రిజిష్టర్ పై కేసు నమోదు!!
*ఫరూక్ నగర్ సబ్ రిజిష్టర్ పై కేసు నమోదు!!*
*ఫోర్జరీ సంతకలతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తితో పాటు సబ్ రిజిష్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితుడు!!*
*కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు!!*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఫరూక్ నగర్ ,సబ్ రిజిష్టర్ సతీష్ పై కేసు నమోదైంది,ఇంటి స్థలాల దస్త్రాలను ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో బుధవారం షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. రాఘవరావు అనే వ్యక్తి బుచ్చయ్య దగ్గర 2011లో
షాద్ నగర్ పట్టణంలోని సర్వేనెంబర్ 717/ఆ లో గల 147, 148లలో మొత్తం 236 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే
నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామానికి చెందిన
శ్రీనివాసులు అనే వ్యక్తి రాఘవరావు సంతకాలను
ఫోర్జరీ చేసి 236 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇతరులకు అమ్మివేశారని తెలిపారు. సదరు యజమాని విషయం తెలుసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బాధితుడు రాఘవారావు అడగగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడని ఇప్పుడు అసలు తతంగం బయటపడిందని నన్ను మోసం చేసిన వ్యక్తితో పాటు షాద్ నగర్ సబ్ రిజిష్టర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సబ్ రిజిష్టర్ సతీష్ తో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్ నగర్ సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు..
Comments
Post a Comment