ప్రతివారం గ్రామ దర్శిని,నగర దర్శిని కార్యక్రమం: జిల్లా కలెక్టర్ డా. గౌర వ్ ఉప్పల్*

 


*ప్రతివారం గ్రామ దర్శిని,నగర దర్శిని కార్యక్రమం: జిల్లా కలెక్టర్ డా. గౌర వ్ ఉప్పల్*
* శుక్రవారం నుండి ప్రారంభం
* మండల ప్రత్యెక అధికారులు,అర్.డి. ఓ. ల ఆద్వర్యంలో గ్రామ,నగర సందర్శన
* ఈ శుక్రవారం మండల స్థాయిలో వివిధ శాఖల  అధికారులతో సమన్వయ సమావేశం, మధ్యా హ్నం ప్రభుత్వ వసతి గృహాల ఆకస్మిక తనిఖీ



నల్గొండ:  శుక్రవారం నుండి గ్రామ దర్శిని,నగర దర్శిని కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ తెలిపారు.మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా శాఖ అధికారుల తో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గ్రామ దర్శిని,నగర దర్శిని కార్య క్రమం,హరిత హరం, పెండింగ్ కోర్టు కేసులు ఇతర అంశాలు సమీక్షించారు.ప్రతి శుక్ర వారం గ్రామ,నగర దర్శిని కార్యక్రమం నిర్వహించ నన్నట్లు తెలిపారు.మండల ప్రత్యెక అధికారులు,అర్.డి. ఓ. ల ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి శుక్రవారం మండలంలో వివిధ ప్రభుత్వ శాఖ ల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మండలంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని అన్నారు.గ్రామ,నగర దర్శిని కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల లు,వసతి గృహాలు,అంగన్ వాడి కేంద్రాలు,పి.హెచ్.సి.లు,
సబ్ సెంటర్ లు,రేషన్ షాపులు ఇతర ప్రభుత్వ సంస్థ లను  మండల ప్రత్యెక అధికారులు ఆద్వర్యంలో   ఆస్మికంగా తనిఖీ నిర్వహించి నివేదికలు సమర్పిస్టారని, అన్నారు.ప్రభుత్వ సంస్థ ల పనితీరు మెరుగు పర్చడమే కాక,ప్రభుత్వం అందిస్తున్న  సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా ,లోటు పాట్లు వుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ శుక్రవారం ఉదయం  మండల ప్రత్యెక అధికారులు ,అర్.డి. ఓ.లు గ్రామ,నగర సందర్శనం లో మండకు స్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి హరిత హరం, పెండింగ్ వ్యక్తి గత మరు గు దొడ్ల నిర్మాణం ఓ.డి.ఎఫ్.,సమీక్షించాలని అన్నారు.అనంతరం నిర్ణీత ప్రోఫార్మా ప్రకారం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లలో రికార్డుల నిర్వహణ,కనీస వసతులు, రిజిస్టర్ లు,స్టాక్ రిజిస్టర్,పారిశుధ్యం,ప్రభుత్వం ఇస్తున్న దుస్తులు,నోట్ బుక్స్, కాస్మ టిక్స్, అందుతున్నా యా,మరుగుదొడ్లు నిర్వహణ,రన్నింగ్ వాటర్,విద్యార్థుల కు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తు నారా, ఏ మైనా రిపేర్లు చేప ట్టాలా ఇతర అన్ని అంశాలు తనిఖీ చేసి నివేదిక సమర్పిస్తారనీ ,వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
హరిత హరం వివిధ శాఖల లక్ష్యం ప్రకారం ఈ.జి.ఎస్.,నాన్ ఈ.జి.ఎస్ ద్వారా మొక్కలు నాటుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.వివిధ శాఖల వారీగా పెండింగ్ కోర్టు కేసులు సమీక్షించి కౌంటర్ లు వెంటనే దాఖలు చేయాలని అన్నారు.ఈ సమావేశంలో డి.ఎఫ్. ఓ. శాంతారాం, డి.అర్. ఓ. రవీంద్ర నాథ్,జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి  శేఖర్ రెడ్డి,సాంఘిక సంక్షేమ శాఖ డి.డి.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్