తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హెచ్చరిక*

_*తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హెచ్చరిక*_


_దిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే ఇరురాష్ట్రాల సీఎస్‌లు తమ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఇది వరకే దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇరురాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా కోరాయి. దీంతో తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది._



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్