గాసిప్స్ నమ్మొద్దు.. నేను బాగానే ఉన్నాను.........
గాసిప్స్ నమ్మొద్దు.. నేను బాగానే ఉన్నాను.........
సెలెబ్రిటీలు ఏం చేసినా వార్తే. కానీ ఒక్కోసారి వాళ్లు చేసిన దాన్ని వేరేలా అర్థం చేసుకుని తప్పుడు వార్తలు పుట్టిస్తుంటారు కొందరు. రీసెంట్‌గా రానా విషయంలో అదే జరిగింది. ఈ మధ్య రానా విదేశాలకు వెళ్లాడు. అప్పట్నుంచి తనకి ఆరోగ్యం బాలేదని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, అందుకే సర్జరీ కోసం వెళ్లా డని… ఇలా ఏవేవో వార్తలు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి కూడా. కానీ అవన్నీ పచ్చి అబద్ధమని తేల్చేశాడు రానా.
సోషల్ మీడియాలో ఓ అభిమాని అతని ఆరోగ్యం గురించి అడిగినప్పుడు రానా స్పందించాడు. తనకెలాంటి సమస్యా లేదని, నెక్స్ట్ ప్రాజెక్ట్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి కొన్ని కంపెనీలతో మాట్లాడటానికి వచ్చానని చెప్పాడు. దాంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రానా వెళ్లింది 'హిరణ్య కశ్యప' ప్రాజెక్ట్ పని మీద. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇది కాకుండా 'విరాటపర్వం'తో బిజీ. బాలీవుడ్‌లో చేసిన హాథీ మేరె సాథీ, హౌస్‌ఫుల్ 4 రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. 'భుజ్' మూవీ సెట్స్‌పై ఉంది.
Comments
Post a Comment