గోలి శిరీషను అభినందించిన మాజీ MLA తాతయ్య
గోలి శిరీషను అభినందించిన మాజీ ఎమ్మల్యే తాతయ్య
స్పోర్ట్స్ అకాడమీ కు సెలెక్ట్ అయిన గోలీ శిరీష ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య .
వత్సవాయి మండలం మంగొల్లు గ్రామానికి చెందిన గోలీ శిరీష 2014 - 15 వ సంవత్సరంలో 6 వ తరగతి చదువుతూ ప్రారంభించిన కబడ్డీ ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతోంది ఇప్పటివరకు డిస్ట్రిక్ట్, స్టేట్స్ మరియు నేషనల్ వరకు (విజయవాడ,గుంటూరు,ప్రకాశం, చిత్తూర్,మధ్యప్రదేశ్) లలో ఆడటం జరిగింది ఈ మధ్య మైలవరం గ్రామంలో జరిగిన లక్కిరెడ్డి-హనిమిరెడ్డి అకాడమీకి జరిగిన కబడ్డీ సెలక్షన్స్ లో శిరీష సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ నేను మ్యాచ్ లకు వెళ్లే ప్రతిసారీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారే ఆర్థికసాయం చేసేవారు అదేవిధంగా మంగొల్లు గ్రామ మాజీ సర్పంచ్ మన్నే రాజేశ్వరి, నారాయణ రావు గారు కూడా ఆర్థికంగా సాయం చేసేవారని తెలియజేసింది ఈ సందర్భంగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ఆడుతున్న శిరీష జాతీయస్థాయి లో ప్రతిభ కనబరచాలని అభినందించి ఆర్థికంగా సాయం చేశారు
Comments
Post a Comment