ఆవు పేడ తో రాఖీలు
ఆవు పేడ తో రాఖీలు
పర్యావరణ పరిరక్షణకు యూపీలోని ఓ గోశాల నిర్వాహకులు వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు. ఆవుపేడతో రాఖీలను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. సహజ రంగులు, దారాలతో వీటిని తయారు చేసినట్టు గోశాల నిర్వాహకురాలు అల్కాల హోటి తెలిపారు. శ్రీకృష్ణ గోశాల నిర్వహిస్తున్న తన తండ్రికి తోడుగా ఉండేందుకు ఇండోనేషియాలో ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన అల్కాల హోటి ఈ సరికొత్త ఆలోచన చేశారు.
ఆవుపేడతో చేసిన ఈ రాఖీలను తొలిసారి కుంభమేళాలో ప్రదర్శించారు. అక్కడికి వచ్చిన వారి నుంచి మంచి స్పందన వచ్చింది. పర్యావరణ రహితం కావడంతో పాటు ఆవుపేడతో చేసింది కావడంతో ఒడిశా,కర్నాటక,ఉత్తరాఖండ్ నుంచి ఆర్డర్లు వచ్చాయి. దీంతో వేలాదిగా రాఖీలు తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ రాఖీలను వివిధ ఆకృతుల్లో తయారు చేసిన టెంప్లెట్లలో నింపి ఆరబెడతారు. అవి గట్టిపడగానే రంగులు, ధారాలు చుట్టి అందంగా తయారు చేస్తారు.
అయితే వీటిని తయారు చేయడంలో ముందుగా చాలా సవాళ్లు ఎదురైనట్టు అల్కాల హోటి వెల్లడించారు.పేడతో తయారు చేసింది కావడంతో అవి వెంటనే విరిగిపోయేవని చెప్పారు. అయితే తరువాత విరిగిపోకుండా ఉండేందుకు ప్రయోగాలు చేసి సక్సెస్ అయినట్టు తెలిపారు.పర్యావరణం కోసం తయారు చేసిన ఈ రాఖీలను తక్కువ ధరకే విక్రయిస్తామన్నారు. ఒకవేళ అవి మిగిలిపోయేతే ఉచితంగా కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. మొత్తం మీద పర్యావరణ ప్రియులను ఆవుపేడతో చేసిన ఈ రాఖీలు ఎంతో ఆకట్టుకోనున్నాయి

Comments
Post a Comment