సమభావన సంఘాల మహిళల సమస్యలు గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం
సమభావన సంఘాల మహిళల సమస్యలు గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వంఅని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆరోపించారు ..ఈ రోజు ఐద్వా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పిడి డిఆర్డి ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ..ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క ఆమె అమలు చేయడం లేదని అన్నారు గ్రూపు కి పది లక్షల రుణం ఒట్టి మాటలుగానే మిగిలాయి అన్నారు.. మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం డబ్బులు సుమారు అరవై కోట్లు ఉన్నప్పటికీ పెన్షన్ ఇవ్వడం లేదు లేదా తిరిగి తమ డబ్బు ఇవ్వడంలేదని అన్నారు ఐకేపీ కేంద్రాల్లో పనిచేసిన పొదుపు సంఘం మహిళలకు రెండు సంవత్సరాలుగా కనీసం ఒక్క రూ రూపాయి కూడా చెల్లించలేదని గొడ్డు కష్టం చేయించారని అన్నారు సంఘబంధాల సభ్యులను నెలకొకసారి సమావేశపరిచి డబ్బులు లెక్కలు చూపించాలి కానీ సంవత్సరాలు గడుస్తున్నా పర్యవేక్ష పరిస్థితి లేకపోవడం వలన వేలాది రూపాయలు అవినీతి జరుగుతుందని ఆరోపించారు సంఘబంధం కమిటీని సంవత్సరానికి ఒకసారి మార్పు చేయాల్సి ఉన్నా లెక్కలు చూపించకపోవడం లక్షల రూపాయలు తినడం వల్ల పై నుంచి కిందికి అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు ఇన్సూరెన్సు అమలు చేయాల్సి ఉన్నా ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించడం లేదని అన్నారు గతంలో పొదుపు మహిళా చనిపోతే ముప్పై వేల రూపాయలు ఇచ్చేది నేడు అది అమలు కావడం లేదు.సంఘాల సభ్యుల పిల్లలకు చదువుకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు గ్రామస్థాయి మొదలు మండల మున్సిపల్ జిల్లా స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించడం లేదని పర్యవేక్షణ లోపం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధ పట్టణ కార్యదర్శి తుమ్మల పద్మ జిల్లా జిల్లా నాయకులు లక్ష్మి .ముత్తమ్మ. ధనలక్ష్మీ సరస్వతి .సత్యమ్మ .వనజ గిరిజ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ
Comments
Post a Comment