ఫేసుబుక్‌లో అమ్మాయి ఖాతాతో ఫిషింగ్ లింక్ పంపించి

ఫేసుబుక్‌లో అమ్మాయి ఖాతాతో ఫిషింగ్ లింక్ పంపించి వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ బిటెక్ విద్యార్థిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.మౌలాలీ ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మాద్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలో ఎథికల్ హ్యాకింగ్ వర్క్‌షాపుకు హాజరై హ్యాకింగ్ గురించి నేర్చుకున్నాడు. దీంతో మెలిన సోఫియా పేరుతో ఓ ఫేసుబుక్ ఖాతాను తెరిచి జెడ్ అప్లికేషన్ ద్వారా ఫిషింగ్ లింక్‌ను పంపిస్తున్నాడు. ఇలా పంపిన ఫిషింగ్ లింక్‌ను ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి క్లిక్ చేసింది. వెంటనే ఆ యువతికి చెందిన యూజర్ నేమ్, పాసువార్డుతో పాటు ఆమె ఖాతాలో ఉన్న అన్ని వివరాలు అతని చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇలా మున్నీర్ యువతి బ్యాంక్ ఖాతాలతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. డబ్బు ఇవ్వకపోతే ఆమె సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఇన్స్‌పెక్టర్  బృందం ఐపీ అడ్రస్సు ద్వారా మునీర్ నిందితుడిగా గుర్తించి అతనిని అరెస్టు చేశారు. అతని నుంచి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు...


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్