తిరుమల బ్రహ్మోస్తావాలు
తిరుమల :
తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ప్రారంభమై అక్టోబరు 8వరకు జరగనున్నాయి.
ఇందులో భాగంగా సెప్టెంబరు 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు.
29న రాత్రి 7-9 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
30న సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఉదయం 9-11గంటల మధ్య, రాత్రి 8- 10 గంటల మధ్య వాహన సేవలు ఉంటాయి.
అక్టోబరు 4న సాయంత్రం 7గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ గరుడసేవ, 5న సాయంత్రం సాయంత్రం 4-6 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు.
8న రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Comments
Post a Comment