ఒకరికి ఇద్దరు... పాక్‌పై భారత బలగాల ప్రతీకారం

*ఒకరికి ఇద్దరు... పాక్‌పై భారత బలగాల ప్రతీకారం* 


         


వరుసగా మూడు రోజుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్న పాకిస్తాన్ సైన్యానికి భారత భద్రతా దళాలు ఇవాళ గట్టి సమాధానం చెప్పాయి. ఓ జవానును పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌కు ఇద్దరు పాక్ రేంజర్లను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, కుప్వారా జిల్లాల్లో పాక్ సైనిక మూకలు కాల్పులకు తెగబడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ రేంజర్లపై అంతే స్థాయిలో విరుచుకుపడిన భారత జవాన్లు ఇద్దరు పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు అధికారుల వెల్లడించారు.


 
సోమవారం కూడా పూంచ్‌లోని షాపూర్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో సరిహద్దు ప్రాంతాలపై పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఆదివారం పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో 10 రోజుల పసికందు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. కాగా గత ఆరు నెలల్లో పాకిస్తాన్ మొత్తం 1,248 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. కేవలం మార్చినెలలోనే 267 సార్లు దాయాది దేశం కాల్పులకు తెగబడగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్తాన్ కాల్పులను భారత సైన్యం అంతే స్థాయిలో తిప్పికొడుతున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభకు తెలిపారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్