కాంగ్రెస్ ‌సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మృతి


*సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి గారు ఈ అర్థరాత్రి 1:28 లకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.*


జైపాల్ రెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 16 జనవరి 1942 లో జన్మించారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై మక్కువ ఎక్కువ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీష్ లిటరేచర్,BCJ అభ్యసించారు.
OUలో విద్యార్థి నాయకుడిగా ఉంటూ...
1969లో  తొలి సారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 1969 నుంచి 1984 దాకా కాంగ్రెస్.. జనతా పార్టీల అభ్యర్థిగా కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందుతూ వచ్చారు. 1984 లో తెలుగుదేశం పార్టీ పొత్తు తో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారి విజయం సాధించారు. 1998లో కూడా మహబూబ్ నగర్  ఎంపీగా గెలిచారు. అనంతరం 1999.. 2004 సంవత్సరాలలో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో చేవెళ్ల  స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఎంపీగా విజయం సాధించారు 1990,1996 లలో రాజ్యసభ సభ్యుడిగా కూడా జైపాల్ రెడ్డి కొనసాగారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. 2004 ..2009 కాంగ్రెస్ హయాంలో కూడా కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.


భార్య.. ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. జైపాల్ రెడ్డికి 1980 సంవత్సరంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసిన చరిత్ర కూడా ఉంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్