తన బార్య గర్భవతి కాలేదని పక్కింటి వ్యక్తి పై కోర్ట్ లో కేసు  చేసిన భర్త*

*తన బార్య గర్భవతి కాలేదని పక్కింటి వ్యక్తి పై కోర్ట్ లో కేసు  చేసిన భర్త*


తను కట్టుకున్న భార్యకి గర్భం రాలేదని పక్కింటి యువకుడిపై కేసుపెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. అదేంటి తన భార్య గర్భవతి కాకపోతే పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటి అని పరేషన్ అవుతున్నారా? అయితే మీరు అసలు ముచ్చట చదవాల్సిందే. అయితే జర్మనీలోని ఓ కోర్టులో జరిగిన వాదనల్లో డానీ అనే వ్యక్తి తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింట్లో ఉంటున్న వ్యక్తి ఘోరంగా విఫలమయ్యాడని సదరు వ్యక్తిని ఏకంగా కోర్టుకు ఈడ్చాడు డానీ అనే వ్యక్తి. అయితే ఇప్పటికే 2.500 డాలర్లు చెల్లించుకున్నట్లు కోర్టుకు వివరించాడు. ఇక అసలు మ్యాటర్ కి పోతే డానీ అనే వ్యక్తి ఎదో లోపంతో అతనికి పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. అయితే ఎలాగైన తన భార్యను ఓ తల్లిని చేయలని కంకణం కట్టుకున్నాడు డానీ. ఇందులో భాగంగా పక్క ఇంట్లో నివాసం ఉంటున్న జోస్ అనే వ్యక్తికి తన భార్యను ఎలాగైన  తల్లిని చేసే బాధ్యత అప్పగించినట్లు బాధిత వ్యక్తి కోర్టుకు తెలిపాడు. కాగా ఒప్పందంలో భాగంగానే ఆరు నెలల్లో తన భార్యను గర్భవతిని చేయాలని డానీ సదరు వ్యక్తిని ఆదేశించాడు. ఇగ డానీ షరతుకు జోస్ ఒప్పుకున్నాడు. ఇగ పనిలో భాగంగానే జోస్ ఆరునెలల్లో డానీ భార్యతో 72 సార్లు ప్రయత్నించినా డానీ భార్య గర్భవతి కాలేదు. దీంతో జోస్‌ను సైతం పరీక్షించిన డాక్టర్లు అతనికి కూడా సంతానయోగం లేదని చెప్పేశారు. ఇక దాంతో డానీ కోర్టును ఆశ్రయించాడు. అయితే జోస్ మాత్రం డానీ ఇచ్చిన పైసలు ఇచ్చేదు లేదని స్పష్టం చేశారు. అయితే ఇందులో తాను డబ్బు తిరిగి ఇవ్వడం ఎంటి అని.. తన ప్రయత్నం తాను చేశానని.. పైవాడి దయ లేదని కోర్టులో చెప్పుకొచ్చాడు జోస్. దీంతో ఎలాంటి తీర్పు ఇస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. *శ్రీనివాస్ రాథోడ్*


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్