ఐటీ ఉద్యోగిని రేప్‌కేసులో 35ఏళ్ల జైలు

*ఐటీ ఉద్యోగిని రేప్‌కేసులో 35ఏళ్ల జైలు*                                                                                                                   12 ఏళ్ల క్రితం పుణెలోని ఐటీ సంస్థలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన విప్రో బీపీఓ ఉద్యోగినిపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు 35 సంవత్సరాల జైలు శిక్ష పడింది. సోమవారం బాంబే హైకోర్టు ఉరిశిక్షను జైలు శిక్షకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. 2007లో 22 ఏళ్ల యువతి మీద పురుషోత్తం బోరాటె, ప్రదీప్ కొకడే ఈ దారుణానికి ఒడిగట్టారు. 2017లో దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంతో పాటు సుప్రీం కోర్టు సెషన్స్‌ కోర్టు తీర్పును సమర్ధించింది. తమ ఉరిశిక్షను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని పురుషోత్తం, ప్రదీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తమ శిక్షను తగ్గించాలంటూ వారు అభ్యర్థించారు. తీర్పు వెలువడిన తరవాత కూడా యరవాడ జైలులో ఏడు సంవత్సరాలుగా ఉన్నారని  నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 


నవంబరు 1, 2007లో చోటుచేసుకున్న ఈ ఘటనతో పుణెలోని ఐటీ సంస్థలు షాక్‌కు గురయ్యాయి. బాధితురాలిని క్యాబ్ డ్రైవర్‌ సంస్థ వద్ద దిగబెట్టకుండా అప్పటికే క్యాబ్‌లో ఉన్న ప్రదీప్‌తో కలిసి  మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె మీద అత్యాచారానికి ఒడిగట్టి, తరువాత గుర్తుపట్టని విధంగా దారుణంగా హత్య చేశారు. 15 కిలోమీటర్ల దూరంలో ఆమె దేహాన్ని పడేశారు. అంతేకాకుండా ఆమె కార్యాలయానికి వచ్చినట్లు తప్పుడు ఎంట్రీ కూడా చేశారు. ఈ ఘటన జరిగిన తరవాత రోజే పోలీసులు వారిని అరెస్టు చేయగా, అక్కడి సెషన్స్ కోర్టు 2012లో వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్