పాఠశాలలు,కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి
నాగార్జున సాగర్,జూలై 26.రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం నాగార్జున సాగర్ నియోజక వర్గం నందికొండ మున్సిపాలిటీ లో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల ఎస్.సి.,ఎస్.టి.వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగం పై ప్రత్యెక దృష్టి పెట్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు,ఆయన తెలిపారు.రాష్ట్రంలో కళాశాల ల్లో విద్య నభ్యసించిన విద్యార్థి ప్రపంచంలో ఆత్మ విశ్వాసంతో పోటీ పడే విదంగా విద్యా రంగంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు వినియోగించుకొని విద్యార్థులు చదువులో రాణించాలని అన్నారు.నంది కొండ మున్సిపాలిటీ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు,మున్సిపాలిటీ నీ ఆదర్శంగా రూపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎం.ఎల్.సి తేరా చిన్నప రెడ్డి,స్థానిక శాసన సభ్యులు నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment