బీజేపీ మల్లగుల్లాలు

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మరోమారు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారం విశ్వాస పరీక్షలో ఓడి పతనమైన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలి రెండు రోజులైనా ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. నాలుగోసారి సీఎం పీఠం ఎక్కాలన్న యడ్యూరప్ప ఆశ నిరాశ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన వయసుతోపాటు పలు కారణాల రీత్యా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోం.ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నేతల ఆశీర్వాదం కోరుతున్నారు.
75 సంవత్సరాలకు పైబడిన నేతలు చట్టబద్ధ పదవులు చేపట్టకూడదని బీజేపీ గతంలో నిర్ణయించింది. ఈ కారణంతోనే బీజేపీ సీనియర్ నేతలైన అద్వానీ, సుమిత్రామహాజన్ వంటి నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిలుపని సంగతి తెలిసిందే. 76 ఏళ్ల యడ్యూరప్పకు ఆయన వయసే అడ్డంకిగా మారినట్లు కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం మనుగడపై గవర్నర్ వాజుభాయ్ వాలా కేంద్రానికి ఇచ్చిన నివేదిక, రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండటం, యడ్యూరప్పపై అవినీతి కేసులు, ఇతర కారణాల రీత్యా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పార్లమెంటరీ బోర్టు నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. సీఎంగా మరొకరిని తెరపైకి తెచ్చే యోచనలో మోదీ, షా ఉన్నట్లు కనిపిస్తోంది. నాలుగోసారి సీఎం అయ్యేందుకు ఉవిళ్లూరుతున్న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది.
బుధవారం జరుగాల్సిన బీజేఎల్పీ సమావేశం వాయిదా పడటంతో ప్రమాదాన్ని పసిగట్టిన యడ్యూరప్ప, ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నేతల ఆశీసులు కోరే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఆయన కుమారుడు విజయేంద్రతోపాటు జగదీశ్ షెట్టర్, అరవింద్, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించడంతోపాటు ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఆయనతో చర్చించారు. మరోవైపు ఈనెల 31లోగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించకపోతే ఆగస్టు నుంచి జీతాలు అందకపోవచ్చని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్