భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్‌భవన్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర భాజపా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Comments
Post a Comment