ఇంకుడు గుంతల పట్ల మరింత అవగాహన కల్పించాలి : పద్మనాభ రెడ్డి*
*ఇంకుడు గుంతల పట్ల మరింత అవగాహన కల్పించాలి : పద్మనాభ రెడ్డి*
నల్గొండ : ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల వాన నీటిని సంరక్షించుకోవడంతో పాటు భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని, ఇంకుడు గుంతల ప్రధాన్యతపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని జిల్లా అదనపు ఎస్పీ పద్మనాభ రెడ్డి అన్నారు.
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయగా వాటిని అదనపు ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సమస్యలను అధిగమించే విధంగా ముందుకు సాగాలని ప్రజలను కోరారు. ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల కలిగే లాభాలు, భావి తరాలకు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చేసిన వాళ్లవుతామని చెప్పారు. పెద్ద ఎత్తున వినియోగిస్తున్న ప్లాస్టిక్ కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకుడు గుంటలపై ప్రజలలో మరింత చైతన్యం తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో డిఎస్పీ రమేష్, వ్యవసాయ శాఖ ఏ.డి. హుస్సేన్, సిఐలు రమణా రెడ్డి, సురేష్ కుమార్, ఆర్.ఐ.లు వై.వి.ప్రతాప్, శంకర్, స్పర్జన్ రాజ్, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ గుప్త, ఆర్.ఎస్.ఐ. శ్రీనివాస్, కిషన్ లయన్స్ క్లబ్ స్టార్స్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment