కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి హైదరాబాద్ -బైన్సా రహదారిపై వినతిపత్రం సమర్పించిన స్పీకర్ పోచారం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి హైదరాబాద్ -బైన్సా రహదారిపై వినతిపత్రం సమర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలోని పార్లమెంట్ మరియు శాసనసభ్యుల బృందం.
న్యూఢిల్లీలో గడ్కరీ ని అధికారిక నివాసంలో కలిసిన స్పీకర్ పోచారం హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి- బాన్సువాడ- రుద్రూర్-బోదన్-బైన్సా (230 కిమీ) పరిదిలోని రాష్ట్ర రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించిందని తెలిపారు. ఈ రహదారిలో హైదరాబాద్ నుండి మెదక్ (64 కిమీ-NH 765 D), మరియు బోదన్ నుండి రుద్రూర్ (10 కిమీ- NH 161BB) వరకు ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తించారని. మిగతా బాగంలోని మెదక్ - రుద్రూర్ (92 కిమీ), బోదన్-బాసర-బైన్సా (55 కిమీ) వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ఆమోదించి విస్తరణకు అనుమతి స్పీకర్ పోచారం కోరారు. .నూతన రహదారి అనుసందానంతో ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోదన్ నియోజకవర్గాల పరిధిలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సులువుగా ఉండడంతో పాటు, ప్రసిద్ధ సరస్వతి దేవాలయం కొలువైన బాసరకు రవాణా మెరుగవుతుందని అని తెలిపారు. ఈ రహదారి విస్తరణలో ప్రాధమిక మౌళిక వసతులు మార్చడానికి అవసరమయ్యే నిధులలో 50 శాతం రాష్ట్ర వాటాగా భరించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించిన విషయాన్ని స్పీకర్ గడ్కరీ కి తెలియజేశారు.
స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వెంట MP లు నామా నాగేశ్వరరావు (ఖమ్మం), బిబీ పాటిల్ (జహీరాబాద్), శాసనసభ్యులు హనుమంత్ షిండే (జుక్కల్), జాజుల సురేందర్ ( ఎల్లారెడ్డి) ఉన్నారు.
Comments
Post a Comment