అనుచరుల హల్‌చల్‌!! ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి

అనుచరుల హల్‌చల్‌!!
ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి


 


వరంగల్‌ : ఓ ప్రజాప్రతినిధి అనుచరులు శనివారం హల్‌చల్‌ చేశారు. చిన్న విషయానికి ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన వరంగల్‌ కమిషనరేట్‌కు కూత వేటు దూరంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... హన్మకొండలోని ఓ ప్లాజాలో పి. సుమన్‌కు ఆర్కిటెక్చర్‌ కార్యాలయం ఉంది. ఉదయం ఆఫీస్‌కు వచ్చిన ఆయన మధ్యాహ్నం ఇంటికి వెళ్లే సమయంలో సెల్లార్‌ నుంచి కారు తీస్తుండగా గేటు ముందు ద్విచక్రవాహనం అడ్డంగా ఉంది. పలుసార్లు హారన్‌ కొట్టినా ఎవరూ రాలేదు. ఆయనే కారు దిగి వచ్ఛి. ద్విచక్రవాహనాన్ని పక్కకు జరిపారు. అదే సమయంలో ఆ వాహన యజమానురాలు వచ్ఛి.. తన బైక్‌ను ఎందుకు జరిపావు అంటూ వాదనకు దిగింది. మాటామాట పెరిగింది. ఆ తర్వాత సుమన్‌ అక్కడ నుంచి వెళ్లిపోయి తిరిగి 4.30 గంటల సమయంలో ప్లాజాకు వచ్చాడు. అప్పటికే అక్కడున్న 10 మంది వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఏం అనుకుంటున్నావ్‌.. ప్రజాప్రతినిధి అనుచరులం.. మా సోదరినే ఎదురిస్తావా.. అని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. భయంతో సుమన్‌ పరిగెత్తుకుంటూ హన్మకొండ ఠాణాకు వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. కొంతమందిని గుర్తించినట్లు తెలిసింది. వారు ఓ ప్రజాప్రతినిధి వద్ద డ్రైవర్‌గా పని చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా ఇరువురు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామన్నారు. విచారణ చేస్తున్నామన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్