అన్నయ్య హితవుతో మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?*
అన్నయ్య హితవుతో మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?*
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వస్తారా? నటిస్తారా? అనే విషయంలో చాలా రోజులుగా భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ గురించి ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు తెరపైకి వచ్చాయి. 2021 వరకు వరుస సినిమాలు చేస్తూ పవర్ స్టార్ బిజీ బిజీగా గడపబోతున్నారట.
తాను మళ్లీ నటన వైపు వస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అధికారికంగా అయితే ప్రకటించలేదు. సినీ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చను పలు మీడియా సంస్థలు తమ బాక్సాఫీస్ న్యూస్ బులిటెన్లలో ఫోకస్ చేసే ప్రయత్నం చేశాయి. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారని, సినిమా కెరీర్‌ను వేస్ట్ చేసుకోవద్దు అని హితవు పలికినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరో వైపు అభిమాలను నుంచి కూడా ఒత్తిడి ఉండటంతో సినిమాల వైపు రావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట.
ఈ ఏడాది నవంబర్లో పవన్ కళ్యాణ్ చేయబోయే మొదటి సినిమా సెట్స్ మీదకు వస్తుందని, గతంలో చేస్తానని మాట ఇచ్చిన బేనర్లలోనే ఆయన వర్క్ చేయబోతున్నారని, మొదట మైత్రి మూవీస్ బేనర్లో సినిమా చేస్తారని, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పని చేస్తారని, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని టాక్.
మైత్రి మూవీస్ బేనర్ సినిమా పూర్తి కాగానే రామ్ తాళ్లూరి బేనర్ ఎస్ఆర్‌టి ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో పవన్ మరో సినిమా చేయబోతున్నారట. గతంలో సినిమా చేస్తానని రామ్ తాళ్లూరికి ఇచ్చిన మాటను పవన్ ఇపుడు నిలబెట్టుకోబోతున్నారట. రామ్ తాళ్లూరితో చేసే సినిమాకు దర్శకుడిగా డాలీ పేరు వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు చేసిన డాలీ పవర్ స్టార్ కోసం కథ సిద్దం చేశాడట. పవన్ ఈ కథ విని కొన్ని మార్పులు సూచించారని, పవన్ కళ్యాణ్ ఇపుడు జనసేన అధినేత కాబట్టి హుందాగా చూపించబోతున్నారని, డాలీ తన చిత్రంలో పవర్ స్టార్‌ను లెక్చరర్ పాత్రలో చూపించబోతున్నట్లు టాక్.
ఆ సారి పవన్ కళ్యాణ్ చేయబోయే చిత్రాలు పక్కా ప్లానింగుతో ఉండబోతున్నాయని, ఆరు నెలలకు ఒక సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. వీలైతే ఈ రెండు సినిమాల తర్వాత ఎఎం రత్నంకు అవకాశం ఇస్తారని టాక్. గతంలో వీరి కాంబినేషన్లో 'సత్యాగ్రహి' అనే సినిమా మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Comments
Post a Comment