ఆది దేవుడికి రసాయనాలు ఆటంకం కారదు - రాష్ట్ర విద్యాశాఖా  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి


ఆది దేవుడికి రసాయనాలు ఆటంకం కారదని రాష్ట్ర విద్యాశాఖా  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. మట్టి విగ్రహాలే గణేశుడికి ప్రీతిపాత్రమైనవని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 2 న జరుగనున్న గణేష్ చతుర్థిని పురస్కరించుకుని సూర్యపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యాక్రమాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి తో పాటు పర్యావరణ పరిరక్షణ కాపాడడం మన విద్యుక్త ధర్మమని ఉపదేశించారు. అందుకు గణేష్ చతుర్థి నాంది పలకాలని ఆయన హితవు పలికారు.రసాయనాలతో తయారు చేసిన గణేష్ ప్రతిమలను మనం నిత్యం వాడుకునే నీటిలో నిమజ్జనం చెయ్యడం వల్ల సంభవించే అనర్దాల విషయంలో ప్రజలను చైతన్య వంతులను చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో బాగంగానే సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో మూడు వేలకు పై చిలుకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అంతే గాకుండా అయిదు ఫిట్ల విగ్రహాలు 100 వరకు ఉచితంగా అందించేందుకు సూర్యపేట పురపాలక సంఘం ముందుకు వచ్చిందన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జడ్. పి ఉపాధ్యక్షుడు వెంకట్ నారాయణ గౌడ్ లతో పాటు  జిల్లా కలెక్టర్ సూర్యపేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి అమయ్ కుమార్ ,మున్సిపల్ కమిషనర్ రామాంజల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్