*మరో 22 మంది అధికారులపై కేంద్రం వేటు* 

*మరో 22 మంది అధికారులపై కేంద్రం వేటు* 


దిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది సీనియర్‌ అధికారులపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. తక్షణమే వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) ఆదేశించింది. వీరంతా సుపరింటెండెంట్‌/ఏవో ర్యాంక్‌కి చెందిన అధికారులు కావడం గమనార్హం. నిబంధన 56(జే) ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సబీఐసీ వివరించింది. 'పన్నుల విభాగంలో కొంత మంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నార'ని స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా ప్రస్తావించిన విషయాన్ని సీబీఐసీ తన ఉత్తర్వుల్లో గుర్తుచేసింది.  


వృత్తిరీత్యా తప్పుడు ప్రవర్తన కారణంగా గతంలోనే 27 మంది సీనియర్‌ అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. 'ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగంలోని ప్రత్యేకాధికారాలతో భారత రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్న 15 మంది సీనియర్‌ ఉద్యోగుల తక్షణ పదవీ విరమణకు రాష్ట్రపతి ఆదేశించారు' అని అప్పట్లో ఆర్థిక శాఖ పేర్కొంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్