మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు : సురేష్ బాబు*

*మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు : సురేష్ బాబు*


నల్గొండ : మద్యం సేవించి వాహనం నడుపుతూ పెట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా పడినట్లు నల్గొండ ట్రాఫిక్ సిఐ సురేష్ బాబు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన ఎనిమిది మందిని కోర్టులో హాజరు పర్చగా గుర్రంపోడుకు చెందిన జి. శివ కుమార్ కు రెండు రోజులు, నల్గొండ పట్టణం అబ్బాసియా కాలనీకి చెందిన వేముల స్వామికి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడినట్లు ఆయన తెలిపారు. మిగిలిన ఆరుగురు వ్యక్తులకు 8,100 రూపాయల జరిమానా విధించారని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మారనున్న ఎంవీఐ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని అందువల్ల వాహనదారులు జాగ్రత్త వహించి నిబంధనలు పాటించి జరిమానాలు బారిన పడకుండా పోలీసులతో సహకరించాలని వారు కోరారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్