కరివేన ప్రాజెక్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
కరివేన ప్రాజెక్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో కీలక రిజర్వాయర్ అయిన కరివేన ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏరియల్ వ్యూ నిర్వహించి అనంతరం ఇంజనీర్లు అధికారులు వర్క్ ఏజెన్సీలతో పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో కరివెన రిజర్వాయర్ కీలకమైనదని దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని సంబంధిత ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీలకు సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను 3 షిఫ్టుల్లో నిరంతరాయంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలిపారు. " మీరు ఇక నుంచి మీ బిల్లులకు చింత చేయవలసిన అక్కర్లేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రం కల్లా క్లియర్ చేసే బాధ్యత నాది. వర్క్ ఫోర్స్ పెంచుకోండి. పని షిఫ్ట్లు పెంచుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. నాలుగున్నర నెలల టార్గెట్ పెట్టుకొని ఎండలు ముదురక ముందే పని పూర్తి చేయండి. వానాకాలం వచ్చేటాల్లకు రైతుల పంటలకు మన నీళ్ళందే తట్టుం డాలే.
ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు లేవు భూసేకరణ సమస్యలు లేవు
అక్కడ కాలేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి . అక్కడక్కడ కొన్ని ఫినిషింగ్ పనులు తప్ప పెద్ద పనేమీలేదాడ. ఇక మన దృష్టి అంతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ మీదనే కేంద్రీకరించాలి. మీ మిష న్లను కూడా పెంచండి. త్వరితగతిన పనులు పూర్తి చేసినప్పుడు మీకు ఇంటెన్స్ వ్లు ఇస్తాం. ఒకవేళ చేయలేకపోతే ఆ విషయం కూడా మాకు స్పష్టం చేయాలి .. తప్ప పనుల్లో తాత్సారం జరగడానికి వీలు లేదు. వచ్చే వానకాలం వరకు పనులు పూర్తి రైతులకు నీళ్లు అందించాలి." అని సీఎం కెసిఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు
ఇంకా ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి , మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేసి అక్కడనుండి వట్టెం ప్రాజెక్టు పరిశీలనకు వాయు మార్గంలో బయలుదేరారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ లు సంతోష్ కుమార్ జోగినపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాములు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి , కొడంగల్ ఎమ్మె ల్యే నరేందర్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్ నీటిపారుదల శాఖ ఈ ఎన్ సి మురళీధరరావు సి ఈ రమేష్ కుమార్ తదితరులున్నారు
Comments
Post a Comment