గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : ఎస్పీ రంగనాధ్*

గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : ఎస్పీ రంగనాధ్*


- - డి.జె.లకు అనుమతి లేదు
- - పోలీస్ సూచనలు పాటించాలి
- - జిల్లాలోని ప్రతి గణేష్ మండపం వద్ద జియో ట్యాగింగ్
- - అన్ని విగ్రహాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి
- - అవాంఛనీయ ఘటనలు చోటు చేసుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు


నల్గొండ : జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని ఎస్పీ ఏ.వి.రంగనాధ్ సూచించారు.


గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టామని అన్నారు. శాంతి సంఘ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులతో సమావేశాలు నిర్వహించి వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు విగ్రహాల వద్ద రాత్రి సమయంలో ఆయా విగ్రహాల వద్ద కనీసం ఇద్దరు వ్యక్తులు బాధ్యత వహించి ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి విధిగా  అనుమతి పొందాలని, అనుమతి పొందిన విగ్రహాల నిర్వాహకులకు పోలీస్ శాఖ ద్వారా పాయింట్ బుక్ అందచేసి రాత్రి సమయాలలో పోలీస్ సిబ్బంది సందర్శించి పాయింట్ బుక్ లో సంతకం చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. గణేష్ మండపాల నిర్వాహకులు సంబందిత పొలీస్ స్టేషన్ లో వారి కమిటీ వివరాలు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలని తెలిపారు. విద్యుత్ కనక్షన్లకు సంబంధించి సంబంధిత శాఖ నుండి అనుమతి పొందాలని చెప్పారు. 


గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకూడదని, రహదారులకు అడ్డంగా షేడ్స్ వేసి గణేష్ విగ్రహాల ఏర్పాటు చేయకూడదని తెలిపారు. మండపాల వద్ద ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, మండపం ఏర్పాటు చేసిన తర్వాత లక్కీ డిప్స్, లాటరీలు నిర్వహించకూడదని సూచించారు.  మద్యపానం, జూదం లాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు మండపాలు వాడకూడదని, అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని, ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే ఆర్పివేసే విధంగా అవసమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.


*బలవంతపు చందాలు వసూలు చేస్తే చర్యలు తప్పవు*


గణేష్ నవరాత్రుల సందర్భంగా బలవంతంగా చందాలు, నిధుల సేకరణ చేయడం నేరమని ఇలా ఎవరైనా బలవంతంగా వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.


*డిజె లకు అనుమతి లేదు*


గణేష్ మండపాల వద్ద, నిమజ్జన శోభాయాత్రలో ఎట్టి పరిస్థితులలో డిజెలను అనుమతించబోమని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డిజెలు వినియోగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లౌడ్ స్పీకర్ల వాడకానికి సంబంధించి నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉండాలని ఎస్పీ తెలిపారు. మండపాల వద్ద ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే మైక్ సెట్లను వినియోగించాలని, రాత్రి 10.00 నుండి ఉదయం 6.00 గంటల వరకు మైక్ సెట్లు వాడరాదని స్పష్టం చేశారు. సైలెన్స్ జోన్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.


జిల్లాలోని అన్ని గణేష్ మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని విగ్రహాలను జియో ట్యాగింగ్ చేస్తున్నామని అందువల్ల విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు అన్ని రకాల అనుమతులు తీసుకొని పోలీస్ శాఖతో సహకరించి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వైభవంగా నిర్వహించుకోవాలని ఎస్పీ ఏ.వి.రంగనాధ్ జిల్లా ప్రజలను కోరారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్