ఏపీకి 152 .. టీఎస్‌కు 59 టీఎంసీలు
ఏపీకి 152 .. టీఎస్‌కు 59 టీఎంసీలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు, కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఏపీకి: శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు, సాగర్ నుంచి 52 టీఎంసీలు, చెన్నైకు తాగునీరు సహా పోతిరెడ్డిపాడు నుంచి 88 టీఎంసీలు, హంద్రీ నీవా, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి 12 టీఎంసీలు, సాగర్ కుడికాలువ ద్వారా 32 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 2 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల విడుదలకు బోర్డు ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణకు: శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, సాగర్ నుంచి 44.51 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు 14.5 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ నుంచి 26.06, ఏఎమ్మార్పీ నుంచి 10.47 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 5.9 టీఎంసీలు, మిషన్ భగీరథకు 2.08 టీఎంసీలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది.
Comments
Post a Comment