*"సాహో" చిత్ర నిర్మాతల ఔదార్యం*   *విద్యుత్ ఘాతంలో గాయపడ్డ ప్రభాస్ అభిమానికి రూ.లక్ష ఆర్థిక సహాయం* 


*"సాహో" చిత్ర నిర్మాతల ఔదార్యం* 


 *విద్యుత్ ఘాతంలో గాయపడ్డ ప్రభాస్ అభిమానికి రూ.లక్ష ఆర్థిక సహాయం* 


 *బాధిత కుటుంబ సభ్యులకు లక్ష అందజేసిన యువనేత మిథున్ రెడ్డి* 


 *"హీరో ప్రభాస్" సాహో బ్యానర్ కడుతూ అభిమాని వెంకటేష్ నాయక్ విద్యుత్ ఘాతం*


ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమామేనియా నడుస్తుంది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం కళ్ళలో ఒత్తులేసుకుని మరీ వేచి చూస్తున్నారు. 10 వేల స్క్రీన్స్ లో సాహో విడుదలవుతుంది. రేపు సినిమా విడుదల అవుతున్న  కారణంగా థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి కూడా మొదలైంది. అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటరులో విద్యుత్ ఘాతం జరిగి బోయినపల్లి ప్రాంతానికి చెందిన ప్రభాస్ అభిమాని వెంకటేష్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాతలు, యువి క్రియేషన్స్ నిర్వాహకులు విక్రమ్ రెడ్డి, వంశిరెడ్డి గాయపడ్డ అభిమాని వెంకటేష్ పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి  తనయుడు ఏపీ మిథున్ రెడ్డి ద్వారా ఈ సంఘటనను తెలుసుకొని ఆయన ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం బాధితునికి అంద చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ నాయక్ మిథున్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ వ్యవహారం పట్ల మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యు.వి క్రియేషన్స్ నిర్మాతలు విక్రమ్ రెడ్డి, వంశి రెడ్డి తనకు స్నేహితులని ఈ సంఘటన గురించి తెలుసుకున్నాక వారు చలించిపోయి లక్ష రూపాయలు వెంటనే బాధిత కుటుంబానికి అందజేస్తున్నట్టు ప్రకటించినట్లు మిథున్ రెడ్డి మీడియాకు తెలిపారు. అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకొని సంబరాలు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అనవసరంగా అభిమానులు తమ ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్