రైతులకు 100శాతం రైతు బంధు అందించాలి-ఎంపీ ఉత్తమ్


రైతులకు 100శాతం రైతు బంధు అందించాలి-ఎంపీ ఉత్తమ్


సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  పాల్గోన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ     మేళ్లచెర్వు మండల పరిధిలోని రైతులకు 100శాతం రైతు బంధు అందించాలని కోరారు. సర్వ సభ్య సమావేశాలకు అన్నిశాఖల అధికారులు విధిగా హాజరు కావాలన్నారు, హాజరు కానివారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను  ఇంకా చాలా మందికి అందలేదని నాదృష్టికి వచ్చిందన్నారు. మహిళా సంఘాలకు పూర్తి స్థాయిలో వడ్డీ రాయితీ అందించాలన్నారు. ఐ కె పి కి సంబంధించి డ్యూస్ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను కోరారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టీచర్ల కొరత, మంచినీటి సమస్య లను పరిష్కరిస్తానన్నారు. రెవిన్యూ శాఖ పరిధిలోని రైతులకు సంబంధించి భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. స్థానిక వైద్య శాల ను త్వరలో సందర్శిస్తానన్నారు. సమావేశానికి వారం రోజులు ముందుగా సభ్యులకు ఎజెండా నోటీసు తోపాటు ఆయాశాఖల నివేదిక లు అందజేయాలన్నారు.గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ లో ఓల్టేజి సమస్యను పరిష్కరించడం తో పాటు, వీధి లైట్లు, రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు.  అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆయా ప్రాంతాలకు మినరల్ ఫండ్ ను కేటాయించాలని ,హుజూర్ నగర్ నియోజక వర్గ ప్రాంతానికి అధికంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని  కోరారు.ఎంపీపీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీటీసీ, ఎంపిటిసిలు సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్