శ్రీవారి సొమ్ము దుబారా చేస్తే "వెంకన్న కోర్టులో" శిక్ష తప్పదు!! - నవీన్ రెడ్డి


శ్రీవారి సొమ్ము దుబారా చేస్తే "వెంకన్న కోర్టులో" శిక్ష తప్పదు!!



వెంకన్న సొమ్ముతో "ఐఏఎస్ అధికారుల" సోకులా!  అంటున్న రాయలసీమ పోరాట సమితి కన్వినర్, 
ఐఎన్టియుసి జిల్లా గౌరవాధ్యక్షులు  నవీన్ రెడ్డి


ఆయన  ప్రకటన యధాతదంగా చదవండి


1)కడప జిల్లా గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా టీటీడీ అధికారులు విలీనం చేసుకుంటే కోర్టు దిక్కారం కేసును ఎదుర్కోవాలి!!
2)టీటీడీ లోని ఐఎఎస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే దేవాదాయ శాఖను ఏకంగా టీటీడీ లో విలీనం చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి???
3)టీటీడీ ఈవో, tirupati jeo, దేవాదాయశాఖ కమిషనర్,ఎస్టేట్ ఆఫీసర్,డిప్యూటీ ఈవో కోర్టుకు సమాధానం చెప్పక తప్పదు!!
4)ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వెంకన్న సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టే హక్కు అధికారం టిటిడి ఐఏఎస్ అధికారులకు ఎవరు ఇచ్చారు??
5)టిటిడి శ్రీవారి నిధులకు ధర్మకర్తల మండలి సమావేశంలో "చట్ట భద్రత" చేయాలి!!
6)ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీవారి సొమ్మును తరలించే సంప్రదాయానికి "స్వస్తి" పలకాలి!!
7)దేవాదాయ శాఖ అనుబంధంగా దినదినాభివృద్ధి చెందుతున్న కాణిపాకం,కాళహస్తి,కనకదుర్గమ్మ లాంటి దేవస్థానాలు ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటే టీటీడీ దేవస్థానం మాత్రం శ్రీవారి "డిపాజిట్లను" "కార్పస్ ఫండ్" ను కర్పూర హారతిలా కరిగించేస్తున్నారు!!
8)టీటీడీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే టీటీడీ అనుబంధ ఆలయాలు నారాయణవనం, నాగలాపురం, అప్పలాయగుంట, వకుళామాత ఆలయాలపై దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయండి!!
9)కడప జిల్లా ఒంటిమిట్ట దేవాలయం బ్రహ్మోత్సవాల కోసం టిటిడి ఇప్పటి వరకు 100 కోట్లు ఖర్చు చేసింది అన్నీ తాత్కాలిక నిర్మాణాలే ఆర్కియాలజీ అనుమతి ఎందుకు టిటిడి ఇప్పటివరకు తీసుకోవడం లేదు??
10)కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం తమ కుర్చీలను కాపాడుకునేందుకు టీటీడీ ఐఏఎస్ అధికారులు వెంకన్న సొమ్మును కర్పూరహారతిలా కరిగించడం మహా అపచారం!!
11)దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాలను టీటీడీ లో విలీనం చేసుకునే ప్రక్రియకు టీటీడీ స్వస్తి పలుకుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలి!!
12)"ఐఏఎస్ అధికారులారా" అధికారాన్ని అడ్డం పెట్టుకొని శ్రీవారి సొమ్ము దుబారా చేస్తే "వెంకన్న కోర్టులో" శిక్ష తప్పదు!!


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్