తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలి - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ - 749 కోట్ల పెనాల్టీ తక్షణమే వసూలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలి - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
749 కోట్ల పెనాల్టీ తక్షణమే వసూలు చేయాలి
వీడియో చూడండి https://youtu.be/uj8hS9HsRNE
తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతు గ్రానైట్ మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న గ్రానైట్ తవ్వకాలపై,ఎగుమతులపై వేల కోట్ల రూపాయల పన్నుల ఎగవేతపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం,గవర్నర్,న్యాయస్థానాల దృష్టికి,మైనింగ్ అక్రమాలను తీసుకెళ్లి పోరాటాలను నిర్వహిస్తామన్నారు. 2008 నుంచి 2011 సం. వరకు గ్రానైట్ వ్యాపారులపై విధించిన రూ: 749 కోట్ల పెనాల్టీ తక్షణమే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment