17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి - N శ్రీవర్ధన్ రెడ్డి తెలంగాణ విమోచన కమిటి చైర్మన్.
వీడియో చూడండి
17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి.
N శ్రీవర్ధన్ రెడ్డి
తెలంగాణ విమోచన కమిటి చైర్మన్.
సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి - విమోచన కమిటి చైర్మన్ ఎన్ శ్రీవర్ధన్ రెడ్డి
బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ,విమోచన కమిటి కన్వీనర్ స్వామి గౌడ్, నూకల వెంకట్ నారాయణ రెడ్డితో కలసి మాట్లాడారు. భారత దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం 1948 సెప్టెంబర్17 స్వాతంత్రం వచ్చిందని, నాటి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తిపొంది నాటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేత పోలీస్ చర్య వల్ల పటేల్ కి లొంగిపోయి తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేసాడని అన్నారు.
నిజాం నిరంకుశత్వానికి అమాయకపు ప్రజలు బలిఅయ్యారని, నిజాం రజాకార్ల పాలనలో ప్రజలందరూ ఎంతో ఇబ్బందులకు,అఘాయిత్యాలకు, అత్యాచారాలకు బలిఅయ్యారని అన్నారు. నిజాం ప్రభువు,రజాకార్ల హింసలకు ఎంతో మంది మరణించగా వందలాదిమంది నిజాంకు జరిగిన వ్యతిరేక ఉద్యమంలో బలిఅయ్యారని, భైరన్ పల్లి లో 96మందిని కాల్చిచంపిన నిజాం రజకార్లు. 96మంది భైరన్ పల్లి గ్రామస్థుల బలి జలియన్ వలబగ్ ను తలపిస్తుందని, పాలమూరు జిల్లా అప్పంపల్లిలో 11మందిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపిన ఘటనలు తెలంగాణ లో అనేకం ఉన్నాయని పేర్కొన్నారు.
TRS ప్రభుత్వం 17సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలిని డిమాండ్ చేశారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి KCR విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వాలను డిమాండ్ చేశారని, TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 6సంవత్సరాలు పూర్తయినప్పటికి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని, రాష్ట్రంలో నిజాం వారసులుగా పాలన చేస్తున్న KCR తెలంగాణ చరిత్రను భావితరాలకు దూరం చేసేవిధంగా వారి పాలన సాగుతుందని అన్నారు.
నాటి నిజాం పాలనలో ఉన్న కర్ణాటకలో ఉన్న జిల్లాలు,మహారాష్ట్ర లో ఉన్న జిల్లాలలో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ చరిత్ర భవిషత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తెలంగాణ లో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులైనరు కొమురం భీమ్, చాకలి ఐలమ్మ,సోయబుళ్ల ఖాన్ లాంటి మహనీయులు అమరులైనరు తెలంగాణ చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన గురుతర బాధ్యతతో బిజెపి 1998 నుండి పోరాటం చేస్తుందని,
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేవిధంగా బిజెపి ఉద్యమిస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేటట్లు వత్తిడి తీసుకోస్తామన్నారు. .రాష్ట్రంలో ఉన్న విద్యావంతులను ,మేధావులను ఏకం చేస్తాం విమోచన దినోత్సవాన్ని జరిపించి తీరుతామన్నారు.
Comments
Post a Comment