సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్
సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విమోచన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసింది. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కామర్సు బాలసుబ్రహ్మణ్యం, జి.ప్రేమేందర్ రెడ్డి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అధికారికతెలంగాణ విమోచన దినోత్సవానికై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పిలుపునిచ్చారు.
Comments
Post a Comment