*హంస వాహిని టాకీస్*  *ఇట్లు మీ శ్రీమతి షూటింగ్ *ప్రారంభం*


*హంస వాహిని టాకీస్* 
*ఇట్లు మీ శ్రీమతి షూటింగ్ *ప్రారంభం*


హంస వాహిని టాకీస్ పతాకంపై ఎమ్. ఎస్.రెడ్డి నిర్మాణంలో మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఇట్లు మీ శ్రీమతి". వినోదభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈరోజు (ఆగస్ట్ 25) జరిగాయి. ప్రముఖ దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెకరిట్రీ టి.ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు అలాగే నిర్మాత దామోదర్ ప్రసాద్ మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టడం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. వెంగీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు తోట.వి.రమణ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఈ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఆ వివరాలు చిత్ర యూనిట్ ప్రకటిస్తారు. 


*ఈ సందర్బంగా నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ...*


ఇట్లు మీ శ్రీమతి సినిమా కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడు మురళి బోడపాటి చెప్పిన కథ నచ్చడంతో సినిమాను నిర్మిస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. కృష్ణ చంద్ర ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ అవుతున్నాడు. నిర్మాత డి.ఎస్.రావ్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు'అన్నారు.


*దర్శకుడు మురళి బోడపాటి మాట్లాడుతూ...*
 ఇట్లు మీ శ్రీమతి సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి గారికి ధన్యవాదాలు. అక్టోబర్ మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ విజయవాడలో ప్రారంభం కానుంది. 35 రోజులు జరిగే ఈ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తి అవుతుంది. వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.


*డి.ఎస్.రావ్ మాట్లాడుతూ...*


నేను గతంలో చాలా పాత్రల్లో కనిపించాను. కానీ ఈ సినిమాలో చేస్తున్న పోలీస్ పాత్ర నిలిచిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దర్శకుడికి ధన్యవాదాలు అన్నారు.


*హీరో కృష్ణ చంద్ర మాట్లాడుతూ...*


మంచి స్క్రిప్ట్ తో హీరోగా పరిచయం అవ్వడం అదృష్టంగా భవిస్తున్నాను. అందరికి ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. మంచి కథ, కథనాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా అన్నారు.


*హీరోయిన్ కారోణ్య కట్రీన్ మాట్లాడుతూ...*


ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన దర్శకుడు బోడపాటి మురళి గారికి, నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి గారికి ధన్యవాదాలు. కథ నచ్చి రెడ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటీనటులు:
కృష్ణ చంద్ర, కారోణ్య కట్రీన్, డి.ఎస్.రావ్, శశి, వివారెడ్డి తదితరులు


బ్యానర్:హంస వాహిని టాకీస్
నిర్మాత: ఎమ్. ఎస్.రెడ్డి
రచన దర్శకత్వం: మురళి బోడపాటి
సినిమాటోగ్రఫీ: తోట వి రమణ
సంగీతం: వెంగీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్