వి సెల్యులాయిడ్ సినిమా ధియేటర్ ను ప్రారంభించిన సినీ హీరో రాంచరణ్...
వి సెల్యులాయిడ్ సినిమా ధియేటర్ ను ప్రారంభించిన సినీ హీరో రాంచరణ్...
థియేటర్ వద్ద రాంచరణ్ కి ఘన స్వాగతం
సూళ్లూరుపేట మండలం పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకోని పిండిపాలెం లోని ఒకే ప్రాంగణంలో నూతన టెక్నాలజీ తో నిర్మించిన వి ఎపిక్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమా ధియేటర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం థియేటర్లోనే పలు సినిమా ట్రైలర్లను తిలకించారు. ఒకే ప్రాంగణంలో మూడు తెరలతో మంచి డిజిటల్ సౌండ్ తో థియేటర్ ను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. సూళ్లూరుపేట అభివృద్ధి పథంలో ఉన్నందున అన్ని నూతన టెక్నాలజీకి సంబంధించిన ఇలాంటివి ఉండడం మన నెల్లూరు జిల్లా ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వంశీ రెడ్డి,విక్రమ్ రెడ్డి,వారి పెద్దలకు శ్యాంసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సూళ్లూరుపేట ప్రాంతం అనగానే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచపటంలోలనే ప్రాధాన్యత కలిగిన షార్ ప్రాజెక్టు అని కొద్దిరోజులలో చందమామని ప్రపంచమంతా చూపించగలిగే స్థాయి షార్ ప్రాజెక్టు అని అలాగే నేలపట్టు,పులికాటు,మాంబట్టు ఇలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఈ సూళ్లూరుపేట ప్రాంతం అటువంటి సూళ్లూరుపేట లో మరో వి ఎపిక్ థియేటర్ ఇక్కడ నిర్మాణం చేసి సూళ్లూరుపేట ప్రాధాన్యతను చాటుకున్నారని తెలియజేశారు.ఈ సందర్భంగా 30 వ తారికు నుండి సినిమాలు వీక్షించవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి,వేనాటి రామచంద్రా రెడ్డి,పెళ్లకూరు సత్యనారాయణ రెడ్డి,వైసిపి నాయకులు అల్లూరు అనిల్ రెడ్డి, వైయస్సార్సీపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దబ్బల శ్రీమంత్ రెడ్డి,యువ నాయకుడు శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment