*మెట్రో స్టేషన్లలో స్నాక్స్ ఫెస్టివల్*
*మెట్రో స్టేషన్లలో స్నాక్స్ ఫెస్టివల్*
అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొదిద్దుకొని ఇప్పటికే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైదరాబాద్ మెట్రో మరో ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు సిద్ధమైంది. మెట్రో స్టేషన్లలో ఆగస్టు 30 నుండి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ స్నాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 న మూడు రోజులపాటు ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సౌత్ కొరియా, స్విట్జర్లాండ్, స్పెయిన్, స్వీడన్, ఇథియోపియా, సూడాన్, చైనా దేశాలకు సంబంధించిన స్నాక్స్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు సంబంధించిన విభిన్నమైన స్నాక్స్ కూడా హైదరాబాద్ వాసులకు పరిచయం చేయనున్నారు.ఫెస్టివల్ సందర్భంగా సందర్శకులకు సెల్ఫీ అవార్డులు కూడా అందించనున్నారు. స్నాక్స్ ఫెస్టివల్‌కు వచ్చే వారు స్టాల్స్ దగ్గర దిగిన సెల్ఫీల్లో ఎక్కువ లైక్స్ వచ్చిన వాటికి బహుమతులు ఇవ్వనున్నారు.

Comments
Post a Comment