తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సైంజ్ APP - 45 వేల ప్రైవేటు ఉద్యోగాల ఖాళీల వివరాలు ఈ APP లో
తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సైంజ్ APP
45 వేల ప్రైవేటు ఉద్యోగాల ఖాళీల వివరాలు ఈ APP లో
నిరుద్యోగ యువతకు ఉద్యోగ సమాచారాన్ని పొందుటకు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సైంజ్ APP ను రూపొందించినట్లు రాష్ట్ర కార్మిక, ఉపాథి కల్పన శాఖ మంత్రి సి.హెచ్. మల్లా రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో DEET APP ను IT శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో కలసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 45 వేల ప్రైవేటు ఉద్యోగాల ఖాళీల వివరాలను ఈ APP లో పొందుపర్చామని తెలిపారు. దీనిలో ప్రైవేటు ఉద్యోగాల తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చని అన్నారు. నిరుద్యోగులు ఈ APP ద్వారా నేరుగా కంపెనీకి దరఖాస్తు చేసుకోవచ్చని, కంపెనీలు ఇంటర్వూ కూడా ఈ APP ద్వారా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఐ.టి. బ్యాంకింగ్, నిర్మాణ రంగం తదితర సంస్థలలో గల ఖాళీలను ఈ APP లో పొందు పరుస్తాయన్నారు. నిరుద్యోగులకు ఈ APP ఒక వరంలాంటిదని అన్నారు. కంపెనీలు కూడా శ్రమ లేకుండా తమ అవసరాలకనుగుణంగా ఉద్యోగాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగ పడుతుందన్నారు. దేశంలో నే మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ కు పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. ఆ కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేసుకోవడానికి ఈ APP ఎంతో ఉపయోగ పడుతుందని, అలాగే నిరుద్యోగులకు కూడా తమకు నచ్చిన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. ఈ APP లో కెంపెనీలు రిజిష్ఠరు చేసుకోవాలని అన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ APP ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం Story Tech Pvt. Ltd. సహకారంతో ఈ APP డెవలప్ చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాథి కల్పన , శిక్షణ సంచాలకులు యాకూబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment