*నల్గొండ జిల్లా కేంద్ర ప్రభత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ కు జాతీయ ఆరోగ్య మిషన్ ""లక్ష్య"" సర్టిఫికెట్*



*నల్గొండ జిల్లా కేంద్ర ప్రభత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ కు జాతీయ ఆరోగ్య మిషన్ ""లక్ష్య"" సర్టిఫికెట్*
* *జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్*
**జాతీయ స్థాయిలో నల్గొండ జిల్లా ఆసుపత్రికి ఎం.సి.హెచ్ కు గుర్తింపు*
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా ఎం.సి.హెచ్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా కేంద్ర ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎం.సి.హెచ్ )కి "లక్ష్య" సర్టిఫికెట్ ను అందచేయనున్నది.లక్ష్య ప్రకారం ఆసుపత్రి ఎం.సి.హెచ్ లోని లేబర్ రూమ్,ఆపరేషన్ ధియేటర్ నిర్వహణ,చిన్న పిల్ల ల వార్డుల పరిశుభ్రత లను 
పరిగణలోకి తీసుకుని లక్ష్య సర్టిఫికెట్ లను అందచేస్తారు.ఈ సర్టిఫికెట్ కొసం రాష్ట్రంలో ని పలు దవాఖానాలు పోటీ పడగా,ఇటీవల కేంద్ర,వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు పరిశీలించి మార్కులు వేశారు. మే 16,17 తేదీల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఇద్దరు డాక్టర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్ ని పరిశీలించారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి  మాతా శిశు ఆరోగ్య కేంద్రం లోని లేబర్ రూం 89 శాతం,ఆపరేషన్ థియేటర్ 86 శాతం స్కోర్ ను సాధించి లక్ష్య కార్యక్రమం కింద నిర్ణయించిన 5 ప్రోటోకాల్ లలో 4 జిల్లా ఆసుపత్రి పూర్తి చేసింది. జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎం.సి.హెచ్ కి లక్ష్య గుర్తింపు పత్రాలను అందచేయనున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్,అడిషనల్ సెక్రెటరీ మనోజ్ జలాని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కు ఎం.సి.హెచ్ సూపరింటెండెంట్ కు సమాచారం పంపారు.లక్ష్య గుర్తింపు తో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి ఏటా 6 లక్షల రూపాయల చొప్పున మూడేళ్ళ పాటు ప్రోత్సాహకం అందచేస్తారు.అయితే లక్ష్య సర్టిఫికెట్ ప్రదానం చేసి ప్రతి సంవత్సరం కేంద్ర బృందం తనిఖీ చేస్తుంది.తనిఖీ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ బాగుంటేనే ప్రోత్సాహం లభిస్తుంది. జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్,వైద్య సిబ్బంది కృషి వల్లే లక్ష్య గురింపు పొందినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ అభినందించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్