మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్
ఖమ్మం
మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక మోసగించిందని కళావతి అనే మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా కోర్టు నోటీసులు తీసుకోకపోవడం, కోర్టుకు హాజరుకాకపోవడంతో ఖమ్మం జిల్లా రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు వారెంట్ జారీ చేసింది.
Comments
Post a Comment