వాసవి క్లబ్ వి 104ఏ దశాబ్ది ఉత్సవాల వేడుక - ఎల్వీ కుమార్
వాసవి క్లబ్ వి 104ఏ దశాబ్ది ఉత్సవాల వేడుక-
ఎల్వీ కుమర్ ప్రకటన
ఆయన ప్రకటన యధావిధిగా చదవండి...
వి104ఏ మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతుంది..... రారెవ్వరు మనకు సాటి..... లెరెవ్వరు మన 104కు పోటీ అనే విధంగా మన వాసవీ జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.... ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు..... ఎన్నో రికార్డులు.... మరెన్నో రికార్డుల బద్దలు..... ఇది సూక్ష్మంగా మన 104ఏ ఘనత, కీర్తి.... మరి ఎన్నో అద్భుత విజయాలకు చిరునామాగా నిలిచిన మన 104ఏ పదేళ్ల ప్రస్థానాన్ని ఒక్క సారి మననం చేసుకుంటూ లెక్కకు మిక్కిలి నిర్వహించిన సేవా కార్యక్రమాలతో దూసుకుపోతూ తన ప్రత్యేకతను విసిఐలో ప్రతి ఏటా చాటుతున్నాం.... సగర్వంగా నిలుస్తున్నాం....
మన 104ఏ పది వసంతాల వేడుకలు చరిత్రను భావి వాసవియన్లకు తెలియచేయడం గడిచిన 10 ఏళ్ల మన గవర్నర్ల సేవా పరంపరను గుర్తు చేసుకునేందుకు *దశాబ్ది ఉత్సవాలు* అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది మన 104ఏ.....అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు, మన 104ఏ పదేళ్ల రధ సారథులు, పూర్వ గవర్నర్లకు ఘన సత్కారం చేసే అద్భుత వేడుక ఇది....ఇంకా గత 10 సంవత్సరాల నుండి మన క్లబ్బులకు సారథ్యం వహించిన అందరూ అధ్యక్షులను ఉచిత రీతిన సత్కరించుకుంధము. ఈ ఉత్సవం మన ఇంటి సంబురం.... వేలాదిగా తరలివద్దం.... మన సేవా స్ఫూర్తిని మరోసారి ఎలుగెత్తి చాటుదాం.... విసిఐలో 104ఏ కీర్తి పతాక ను సగర్వంగా నిలుపుదాం....
దశాబ్ది ఉత్సవాల వేడుక
తేది. 13 అక్టోబర్ 2019, ఆదివారం
వేదిక : జి.ఎం. A/C కన్వెన్షన్ హాల్
చైతన్యపురి, దేవరకొండ రోడ్, నల్గొండ.
Comments
Post a Comment