*మంచిర్యాల పోలీసులు అధికార పార్టీకి మద్దతు..... *
*మంచిర్యాల పోలీసులు అధికార పార్టీకి మద్దతు *
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కి ఫిర్యాదు చేసిన మంచిర్యాల బీజేపీ నాయకులు*
ఢిల్లీ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి మరియు మంచిర్యాల అసెంబ్లీ ఇంఛార్జి రఘునాథ్ వెరబెల్లి కలిసి ఫిర్యాదు చేశారు
మంచిర్యాల పట్టణం లో 23/08/2019 రోజున బీజేపీ మరియు టిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చ కు సిద్దం అయినప్పుడు పోలీసులు ముందుగా వచ్చిన బీజేపీ నాయకులను వివేకానంద విగ్రహానికి పూల మాల వేయకుండా అడ్డుకున్నారని , టిఆర్ఎస్ నాయకులు పూల దండ వేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు అది చూస్తూ కూడా పట్టించుకోకుండా ఉన్నారని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా పోలీసులు రాష్ట్ర అధికార పార్టీకి మద్దతు పలుకుతూ మరియు బీజేపీ నాయకుల, కార్యకర్తల పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అని మంచిర్యాల పోలీసులపై మంత్రి కి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, సతీష్ రావు, తులా ఆంజనేయులు, తుల మధుసూదన్ రావు, పట్టి కృష్ణ, రంగ శ్రీశైలం, పత్తి శ్రీనివాస్, కిషోర్, శరత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment